UPSC 2024: సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు రేపటి నుంచే రిజిస్ట్రేషన్.. లాస్ట్ డేట్ ఇదే..!

UPSC Exam 2024: యూపీఎస్సీకు రంగం సిద్ధమైంది. సివిల్స్ కు అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షను మే 26న నిర్వహించే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 10:07 PM IST
UPSC 2024: సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు రేపటి నుంచే రిజిస్ట్రేషన్.. లాస్ట్ డేట్ ఇదే..!

UPSC Civil Services Exam 2024: దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎగ్జామ్ కు నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వేలల్లో పరీక్ష రాస్తే కొందరు మాత్రమే క్వాలిఫై అవుతారు.  ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in, upsc.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  సివిల్స్ ప్రిలిమినరీ (CIVILS PRELIMS EXAM) పరీక్షను 2024 మే 26న నిర్వహించనున్నారు. అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 05. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లై చేసుకోండి ఇలా..
**ముందుగా మీరు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయాలి. 
**ఆ తర్వాత హోమ్ పేజీలో ఉన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
**ఓపెన్ అయిన పేజీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
**అనంతరం లాగిన్ అవ్వి.. అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి. 
**ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
**అనంతరం ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని హార్డ్ కాపీని భద్రపరుచుకోవాలి. 

Also Read: JEE Main 2024 Session 1 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, అగ్రస్థానం తెలుగు రాష్ట్రాలకే

Also Read: Free Electricity: ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News