UPSC: ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలనుకుంటున్నారా..? అయితే మీకు కీలకమైన అప్‌డేట్‌ ఇదే!

UPSC Civil Services Prelims Exams Postponed: దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్స్‌ పరీక్షల్లో కీలక మార్పు జరిగింది. అభ్యర్థుల్లారా ఈ వార్త తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2024, 08:17 PM IST
UPSC: ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలనుకుంటున్నారా..? అయితే మీకు కీలకమైన అప్‌డేట్‌ ఇదే!

UPSC Prelims Postpone: సివిల్స్‌ పరీక్షలు అంటే దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న పోస్టులు. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించేవి సివిల్స్‌ పరీక్షలు. ఆ పరీక్షలు తాజాగా వాయిదా పడ్డాయి. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదాకు గురయ్యాయి. ఈ విషయాన్ని జాతీయ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Savings Scheme: తక్కువ చెల్లింపుతో దర్జాగా నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం

భారత సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ పడుతున్న విషయం తెలిసిందే. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రాథమిక పరీక్ష అంటే ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్‌ సర్వీస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు వాయిదా వేసింది. వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్‌ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే 26వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కారణంగా పరీక్షల నిర్వహణ కష్ట సాధ్యం కావడంతో యూపీఎస్సీ వాటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: Pink Tax: పురుషుల కంటే మహిళలకే అధిక ధరలు.. అసలు 'పింక్‌ ట్యాక్స్‌' అంటే ఏమిటో తెలుసా?

వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఈ సందర్భంగా రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌, ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలను జూన్‌ 16వ తేదీన నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనల్లో వెల్లడించింది. సివిల్‌ సర్వీసెస్‌లో 1,056 ఉద్యోగాలు, అటవీ శాఖలో 150 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల గడువు ఈనెల 6వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

వీటికి సంబంధించిన మెయిన్స్‌ పరీక్ష అక్టోబర్‌ 19వ తేదీన నిర్వహించాల్సి ఉంది. కాగా యూపీఎస్సీ ప్రతియేటా ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏ ఉద్యోగ ప్రకటన ఎప్పుడు, పరీక్ష, తుది ఫలితాలు వంటి తదితర వివరాలతో స్పష్టమైన షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేస్తుంది. యూపీఎస్సీకి దేశంలో అత్యంత విశ్వసనీయత కలిగి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News