'జన్ లోక్ పాల్ ఆందోళనలు' మర్చి 23 నుండి ప్రారంభం: అన్నా హజారే

సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి జన్ లోక్ పాల్ ఆందోళనలకు షురూ అయ్యారు. వచ్చే సంవత్సరం మర్చి 23 నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. 

Last Updated : Nov 29, 2017, 05:46 PM IST
'జన్ లోక్ పాల్ ఆందోళనలు' మర్చి 23 నుండి ప్రారంభం: అన్నా హజారే

సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి జన్ లోక్ పాల్ ఆందోళనలకు షురూ అయ్యారు. వచ్చే సంవత్సరం మర్చి 23 నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. రైతులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మర్చి 23 వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు  అన్నా హజారే బదులిస్తూ.. ఆరోజు 'షహీద్ దివాస్ (అమరుల దినం)'  అన్నారు. 

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని రాలెగాన్ సిద్ధి గ్రామానికి చెందిన తన మద్దతుదారులతో కలిసి సమావేశంలో హజారే ఇలా అన్నారు -  'జన్ లోక్ పాల్, రైతుల సమస్య మరియు ఎన్నికలలో సంస్కరణలకు మేము ఆందోళనలు చేస్తాము. ఆందోళనలు  సత్యాగ్రహంలా అహింసా వాదంతో ఉంటుంది". గాంధేయవాది హజారే, నేను ఈ అంశాలపై ఎన్నోసార్లు  ప్రధానమంత్రికి లేఖలు రాశానని, కాని ఆయన నుంచి ఇంకా స్పందించలేదని అన్నారు. 

2011లో అన్నా హజారే 12 రోజులపాటు దీక్ష చేశారు. దేశవ్యాప్తంగా ఆయన దీక్షకు ఎందరో మద్దతు ప్రకటించారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జన్ లోక్ పాల్ బిల్లు ను సూతప్రాయంగా ఆమోదించింది. 

Trending News