Polavaram Project: పోలవరంపై చర్చ కోసం పట్టుబడిన వైసీపీ ఎంపీలు, లోక్‌సభలో ఆందోళన

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ పోలవరం కోసం అధికార పార్టీ ఆందోళన చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 19, 2021, 04:04 PM IST
Polavaram Project: పోలవరంపై చర్చ కోసం పట్టుబడిన వైసీపీ ఎంపీలు, లోక్‌సభలో ఆందోళన

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ పోలవరం కోసం అధికార పార్టీ ఆందోళన చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. 

ఏపీ ప్రజలకు ప్రతిష్ఠాత్మకమైంది పోలవరం ప్రాజెక్టు(Polavaram Project). విభజన చట్టంలో భాగంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament monsoon sessions) ప్రారంభం సందర్బంగా పోలవరం విషయంలో చర్చకోసం పట్టుబట్టింది. సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సభ ప్రారంభం కాగానే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని వైసీపీ ఎంపీలు డిమాంచ్ చేశారు.వెల్‌లోకి దూసుకెళ్లి..నిరసన తెలిపారు. పోలవరంపై వాయిదా తీర్మానానికి ఎంపీ మిధున్ రెడ్డి నోటీసిచ్చారు. వైసీపీ సభ్యుల ఆందోళన నేపధ్యంలో సభ మద్యాహ్నం 3.30 గంటల వరకూ వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం(Central government)పట్టించుకోవడం లేదనేది వైసీపీ ఆరోపణ. 

Also read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష జరిపిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News