Zee Entertainment Born to Shine : 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు జీ ఎంటర్టైన్మెంట్ మీడియా స్కాలర్ షిప్

Born to Shine బార్న్ టు షైన్ కార్యక్రమంలో భాగంగా జీ మీడియా దేశంలోని ముప్పై మంది ప్రతిభావంతులైన బాలికలకు స్కాలర్ షిప్ అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 12:36 PM IST
Zee Entertainment Born to Shine : 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు జీ ఎంటర్టైన్మెంట్ మీడియా స్కాలర్ షిప్

Zee Entertainment Born to Shine : దేశంలో జీ మీడియాకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. వార్తారంగంలో, వినోదాన్ని అందించడంలోనే కాకుండా.. సామాజిక సేవా కోణంలోనూ జీ మీడియా మిగతా అన్ని సంస్ధలకంటే ముందుంటుంది. గత కొన్నేళ్లుకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎంతో మంది బాలికలకు స్కాలర్ షిప్‌లు అందిస్తూ వస్తోంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా కళారంగానికి సంబంధించిన 5000 మందికి పైగా బాలికలు ఈ స్కాలర్ షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

5 మంది అనుభవజ్ఞులతో కూడిన ప్రత్యేక జ్యూరీ వివిధ రౌండ్ల తర్వాత వీరిలో 30 మంది ప్రతిభావంతులైన బాలికలను ఎంపిక చేసింది. Zee ఎంటర్‌టైన్‌మెంట్, గివ్ ఇండియా తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద బార్న్ టు షైన్‌లో 30 మంది విజేతలను ఆదివారం ముంబైలో సత్కరించింది. దేశంలోని 8 నగరాల నుంచి ఎంపికైన 5 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు రూ.4 లక్షల స్కాలర్‌షిప్‌తోపాటు ముప్పై నెలల పాటు మెంటరింగ్ అందించారు.

ఈ ప్రత్యేక జ్యూరీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా, జరీనా స్క్రూవాలా (మేనేజింగ్ ట్రస్టీ & డైరెక్టర్, స్వదేశ్ ఫౌండేషన్), డా. బిందు సుబ్రమణ్యం (సహ వ్యవస్థాపక సీఈఓ, సుబ్రమణ్యం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (SaPa), సమర మహీంద్రా (వ్యవస్థాపకుడు) ఉన్నారు. CEO, CARER), రూపక్ మెహతా (స్థాపకుడు, బ్రహ్మనాద్ కల్చరల్ సొసైటీ).

సైన్స్, గణితం, క్రీడలలో ప్రతిభను ప్రోత్సహించడానికి దేశంలో అనేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. అయితే దేశంలో తమదైన ముద్ర వేస్తున్న బాలికలను కనుగొని మెరుగుపరచడం ఎంతో ముఖ్యమైంది. కళల రంగంలో బాలికలను ప్రోత్సహించడం కోసం జీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

మన దేశంలో చాలా ప్రాంతాలలో, అమ్మాయిల ఆశయాలను, ముఖ్యంగా కళారంగంపై వారి ఆసక్తిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితిలో, బోర్న్ టు షైన్  ప్రోగ్రాం ద్వారా ప్రతిభావంతులైన పిల్లలను కనుగొని, వారి కలలకు రెక్కలు వచ్చేలా వారిని ప్రోత్సహించే చిన్న ప్రయత్నం సఫలీకృతం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చొరవతో దేశంలోని యువత దేశ బంగారు రేపటి (భవిష్యత్తు)ని లిఖించే దిశగా పయనిస్తున్నారని, కచ్చితంగా విజయాల ఆకాశంలో మెరిసే నక్షత్రాలుగా ఎదగగలరని భావిస్తున్నారు.

Also Read : Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు

Also Read : Karthi Facebook Hacked : హీరో కార్తీకి చుక్కెదురు.. ఫేస్ బుక్ హ్యాక్ అవ్వడంతో ట్వీట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News