4 Ways To Prevent Dengue: 4 నివారణలతో డెంగ్యూ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి..

4 Ways To Prevent Dengue: ప్రస్తుతం చాలామంది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. వాతావరణం మార్పుల కారణంగా తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు.. తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2023, 11:16 AM IST
4 Ways To Prevent Dengue: 4 నివారణలతో డెంగ్యూ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి..

Preventive Measures Of Dengue In Points: డెంగ్యూ అనేది దోమల నుంచి సంక్రమించే వ్యాధి. ఈడిస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ డెంగ్యూ వచ్చిన వారిలో తీవ్ర జ్వరం, కండరాల నొప్పి, కీళ్ళవాపులు, తలనొప్పి ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో ఈ డెంగ్యూ జ్వరం హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది. దీని కారణంగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మందిలో ఏడుగురు డెంగ్యూ జ్వరం వల్ల మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాబట్టి డెంగ్యూ ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది..ఆ చిట్కాలు ఏంటో వాటిని క్లుప్తంగా తెలుసుకుందాం..

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి:
కొంతమంది ఇంటి చుట్టూ మురికి నీటిగుంటలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా దోమలు అధికంగా వ్యాపించే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ డెంగ్యూ దోమలు వ్యాపించకుండా ఉండడానికి మురికి నీటి గుంటలు ఉన్నచోట నీటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ పరిసరాల్లో అంటే మీ ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు వ్యాపించే అవకాశాలు ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ దుస్తులను ధరించాలి:
దోమల ప్రభావిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా.. మీరు మీ శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులను తప్పకుండా ధరించాల్సి ఉంటుంది. లేకపోతే దోమకాటు బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా డెంగ్యూ దోమలు మీపై వాలకుండా ఉండడానికి..లేత రంగు దుస్తులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీలైతే మీ శరీరాన్ని కప్పంచే దుస్తులను ధరించాలి.

మస్కిటో రిపెల్లెంట్స్ వినియోగించండి:
డెంగ్యూ దోమల ప్రభావం మీపై పడకుండా ఉండడానికి చర్మంపై DEET, పికారిడిన్ లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనెలను వినియోగించాల్సి ఉంటుంది. దోమల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తప్పకుండా వీటిని వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే డెంగ్యూ దోమల కారణంగా వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అని దీని కారణంగా ఆనందంగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News