Kids Cough Home Remedy: పిల్లలు విపరీతంగా దగ్గుతున్నారా?.. నివారణకు 5 ఇంటి చిట్కాలు

Constant Cough In Child: వాతావరణం మార్పుల కారణంగా అనారోగ్య సమస్యల రావడం సర్వసాధారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే వ్యాధుల కారణంగా శరీరంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీంతో చాలా మందిలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఈ ఇంటి చిట్కాలు పాటించండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 04:13 PM IST
Kids Cough Home Remedy: పిల్లలు విపరీతంగా దగ్గుతున్నారా?.. నివారణకు 5 ఇంటి చిట్కాలు

Constant Cough In Child: చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం కారణంగా దగ్గు, జలుబు, జ్వరం మొదలవుతాయి. అయితే ఈ ప్రభావం అధికంగా చిన్నల పిలల్లో ఎక్కువ కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు సమస్య ఎక్కువగా  రాత్రిపూట మొదలవుతుంది. ఈ కారణంగా ఛాతీ నొప్పి, దగ్గు పిల్లల నిద్రని దెబ్బతిస్తుంది. మీ పిల్లలు కూడా దగ్గుతో బాధపడుతుంటే ఇక్కడ చెప్పిన ఇంటి నివారణలను ప్రయత్నించి చూడండి 

పిల్లల దగ్గు కోసం ఇంటి చిట్కాలు...
 
1. తులసి: తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ పిల్లలకు తులసి ఆకుల తినిపించడం లేదా రసం చేసి తేనెతో కలిపి ఇవ్వడం ద్వారా దగ్గు సమస్య నుంచి బయటపడుతారు. అంతేకాకుండా తులసి గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

2. యూకలిప్టస్ నూనె: ఈ యూకలిప్టస్‌ నూనెను 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి కోసం ఉపయోగిస్తారు. పిల్లల దిండుపై కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయడం కారణంగా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఈ నూనెతో పిల్లల మెడకు మసాజ్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3. మిశ్రీ, కలకండ మిశ్రీ: మిశ్రీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

Also Read: Carrots Benefits: ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే క్యారెట్‌ను వదలకుండా ప్రతిరోజు తింటారు..

4. పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్  లక్షణాలు అధికంగా ఉంటాయి. గొంతు నొప్పికి పసుపు కలిపిన పాలు తీసుకోవడం కారణంగా వెంటనే ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో సహాయపడుతుంది.
 
5. వెల్లుల్లి: రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వెల్లుల్లి, తేనెను తీసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది. చిన్న వెల్లుల్లి రెబ్బను మెత్తగా కోసి తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.

Also Read: Eating Gums: చూయింగ్‌ గమ్‌ను నములుతూ సింపుల్‌గా బరువు తగ్గండి.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News