Acne Scars Removal: మొటిమలు, మచ్చలు తగ్గడానికి ఖరీదైన ప్రోడక్ట్స్‌కు బదులుగా ఇలా టొమాటోతో చెక్‌ పెట్టొచ్చు!

How To Apply Tomato On Face For Acne Scars: చర్మానికి క్రమం తప్పకుండా టొమాటో రసాన్ని అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మంపై మొటిమలు కూడా సులభంగా తొలగిపోతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 20, 2023, 05:01 PM IST
Acne Scars Removal: మొటిమలు, మచ్చలు తగ్గడానికి ఖరీదైన ప్రోడక్ట్స్‌కు బదులుగా ఇలా టొమాటోతో చెక్‌ పెట్టొచ్చు!

 

How To Apply Tomato On Face For Acne Scars: వేసవి కాలం కారణంగా చాలా మందిలో ముఖంపై మొటిమల సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ముఖం నిగారింపు తగ్గిపోయి, అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎండ నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ప్రస్తుత ముఖానికి ఖరీదైన ప్రోడక్ట్స్‌ అతిగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ టొమాటోతో తయారు చేసిన రసం వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మంపై అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే దీని వల్ల చర్మానికి ఇంకెన్ని ప్రయోజనాలు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టొమాటోను ఇలా అప్లై చేయండి:
టొమాటో రసం:

యుక్త వయసులో మొటిమలు రావడం సహజం. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లాని నీటితో శుభ్రం చేసుకుంటే త్వరలో మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  

టొమాటో, పెరుగు:
టమోటాలో పెరుగు రెండింటిని కలిపి ముఖానికి పట్టిస్తే..ముఖంపై ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొటిమల మచ్చలు తొలగిపోతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసేందుకు కూడా సహాయపడతాయి. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెండు మిశ్రమాలను ప్రతి రోజు ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. 

టొమాటో రసం, తేనె:
తేనెలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు దీనిని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది శరీరానికే కాకుండా ముఖానికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అయితే ఈ రెండు పదార్థాలను మిశ్రమంగా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత ముఖానికి అప్లై చేయాలి. 

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News