Amaranth Leaves Benefits: ఆకుకూరలు మాదిరిగానే అమర్‌నాథ్ అనేది కూడా ఒక రకమైన ఆకుకూర. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు. అమర్‌నాథ్ ఆకులు, మొక్క, దాని గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే దీని వల్ల శరీరానికి దక్కే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమర్‌నాథ్ వంటి ఆకుకూరలో విటమిన్ - ఎ, బి, సి, డి, నియాసిన్, ఫొలేట్, రైబోఫ్లావిన్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరంలోని విషపదార్థాలను తరిమికొడతాయి. దీంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. రక్తంలో ఉండే అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అమర్‌నాథ్ గింజల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. వీటిలోని ప్రోటీన్స్ రక్తంలో వెంటనే కరిగిపోవు. దీంతో బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఒకేసారి పెరగవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ అమర్‌నాథ్ గింజలను న్యూట్రీషన్లలా పనిచేస్తాయి.
అమర్‌నాథ్ గింజల్లో ఉండే నూనెలు, విటమిన్స్, పైటోస్టెరాల్స్, మినరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వీటి గింజలను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. దీంతో రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. గుండెకు మరెంతో మేలు చేస్తుంది.
అమర్‌నాథ్ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలోని మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, భాస్వరం వంటివి.. ఇవి చిన్న పిల్లలకు, గర్భిణీలకు మేలు చేస్తాయి. కడుపు సంబంధిత వ్యాధుల నుంచి అమర్‌నాథ్ ఆకులు, గింజలు ఉపశమనం కలిగిస్తాయి. రక్తహీనతను నివారించేందుకు ఇదో చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకాన్ని అరికడుతుంది. మూత్రం పోసేప్పుడు మంట, కడుపు నొప్పి, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. గుండెజబ్బులు, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తహీనత, కాలిన గాయాలు త్వరగా మానిపోవడానికి ఈ గింజలను తింటే మంచి జరుగుతుంది.
ఎక్కడ లభిస్తాయి?
అమర్‌నాథ్ గింజలు, ఆకులు వంటివి ప్రముఖ మార్కెట్లలో లేదా అన్ని రకాల షాపులతో పాటు ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అమర్‌నాథ్ ప్రొడక్ట్స్ లభ్యం అవుతాయి. ఇవి గింజలు లేదా పొడి రూపంలో దొరుకుతాయి. అయితే ఈ పొడి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. ఈ పొడిని స్వీట్లతో పాటు ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినొచ్చు.
తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లా అమర్‌నాథ్ మొక్కలను కూడా వండుకొని తినేయోచ్చు. అయితే కొందరూ రోజూ తమ ఆహారంతో అమర్‌నాథ్ మొక్కలను చేర్చుకుంటారు. ఇది తినడం వల్ల గంటల తరబడి నీరసం రాకుండా ఉండేందుకు సహాయకారిగా పనిచేస్తుంది. అమర్‌నాథ్ ఆకుకూర, గింజలు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి