Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా ఉసిరితో కేవలం 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Amla Water For Weight Loss: ఉసిరికాయను ఔషధంగా ఆయుర్వేద శాస్ర్తంలో భావిస్తారు. దీనిని ఆయుర్వేద ఔషధ ఉపయోగాల్లో వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు చర్మ, జుట్టును సంరక్షిస్తుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 04:44 PM IST
  • బరువు తగ్గాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌
  • ఇలా ఉసిరి నీటితో కూడా బరువు తగ్గొచ్చు
  • ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తాయి.
Weight Loss Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా ఉసిరితో కేవలం 10 రోజుల్లో బరువు తగ్గొచ్చు..

Amla Water For Weight Loss: ఉసిరికాయను ఔషధంగా ఆయుర్వేద శాస్ర్తంలో భావిస్తారు. దీనిని ఆయుర్వేద ఔషధ ఉపయోగాల్లో వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు చర్మ, జుట్టును సంరక్షిస్తుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తాయి. అయితే దీనిని వివిధ రకాలు తీసుకోవచ్చు. చాలా మంది మధుమేహాన్ని నియంత్రించడానికి దీనితో తయారు చేసిన పొడిని తీసుకుంటారు. అయితే దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దీని తయారు చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:

పొట్ట సంబంధిత సమస్యలకు చెక్‌:
ఉసిరిలో ఉండే మూలకాలు పొట్ట సమస్యలకు చెక్‌ పెడుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటిన్లు జీర్ణక్రియను శక్తి వంతంగా చేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ పొట్ట సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది:
ఆమ్లా నీరును డిటాక్స్ డ్రింక్‌గా కూడా వినియోగించవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు ముఖానికి గ్లో తీసుకు రావడమేకాకుండా అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, చుండ్రు సమస్య దూరమవుతుంది.

బరువు తగ్గుతారు:
 క్రమం తప్పకుండా ఈ ఉసిరి నీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను వేగవంతం చేని కేలరీలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కంటి చూపును పెంచుతుంది:
ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుపరిచేందుకు సహాయపడుతాయి. కంటి సమస్యలను దూరం చేస్తుంది.

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News