Disadvantages Of Mobile For Health: నేటి కాలంలో పూరి గుడిసెలో ఉండే వారి నుంచి పిల్లల వద్ద కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. నేటి తరంలో పుస్తుకాలు లేకపోయిన  చేతిలో ఫోన్‌  తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం మన పనులను పూర్తి చేసుకోవడంలో మొబైల్‌ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫోన్‌  ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రాణానికి ఎంతో నష్టం కలిగిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  

అతి ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది. దీని వల్ల ఎంత ఉపయోగం ఉన్న మన శరీరానికి బారిన హానిని కలిగిస్తుంది.  మరి ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం..

రేడియేషన్:
 
మొబైల్‌ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ విడుదల అవుతాయి. ఇవి ఎంతో హానికరమైనవి. దీని వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఫోన్‌ను అతిగా వినియోగించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

నిద్రలేమి సమస్య: 

నేటి తరం పిల్లలు రాత్రి కూడా మొబైల్‌ ఫోన్‌ను వినియోగిస్తారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన నిద్ర సరిపోకుండా ఉంటుంది. శరీరాకి నిద్ర చాలా అవసరం. రాత్రి పూట ఎక్కువ సమయం మొబైల్‌ వాడటం వల్ల నిద్రలేమి సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం అలసటగా, నీరసంగా ఉంటుంది.

కంటి సమస్య:

మొబైల్‌ నుంచి వచ్చే కాంతి ప్రభావం కారణంగా కంటి సమస్యలు అధికం అవుతాయి. రాత్రి పూట లైట్స్‌ ఆఫ్‌ చేసి సెల్‌ని చూడటం వల్లడార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది. 

ఒళ్ళు నొప్పులు: 

మనలో చాలా మంది వివిధ భంగిమలో ఫోన్‌ను ఉపయోగిస్తారు.  దీని వల్ల మెడ నొప్పులు, నడుము నొప్పి ఇతర సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. 

Also Read Kasara Kayalu: పొలం గట్లపై ఉండే ఈ కాసర కాయలను తింటే, శరీరంలో మ్యాజిక్ జరగడం ఖాయం..

మొబైల్‌  ఫోబియా:

తరుచు ఫోన్‌ను వినియోగించడం వల్ల ఫోన్ కి అడిక్ట్ అయిపోయాము. దీని వల్ల మీ జీవితం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని వాడకాన్ని తగ్గించండి అవసరమైతే తప్ప దీని ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. 

మతిమరుపు వ్యాధి: 

మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎక్కువగా వాడటం మంచిది కాదు. 

Also Read Ramaphalam: రామఫలం తిని తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

English Title: 
Are You Using Your Phone Then Be Careful You Might Face Chronic Health Problems Sd
News Source: 
Home Title: 

మొబైల్‌ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వ్యాధికి స్వాగతం పలికినట్లే!

Effects Of Mobile: మొబైల్‌ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వ్యాధికి స్వాగతం పలికినట్లే!
Caption: 
zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మొబైల్‌ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వ్యాధికి స్వాగతం పలికినట్లే!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, February 10, 2024 - 10:32
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
22
Is Breaking News: 
No
Word Count: 
282

Trending News