Back Pain Relief 1 Day Diet Plan: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. రోజంతా బిజీగా ఉంటూ చివరికి అలసిపోతున్నారు. మరికొందరైతే ఆఫీసుల్లో విపరీతమైన పనులు చేస్తూ వెన్నునొప్పి, నడుము నొప్పులు బారిన పడుతున్నారు. వెన్నునొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అది తీవ్ర సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు తీవ్రతరంగా మారే అవకాశాలు ఉన్నాయి. వెన్నునప్పుడు నడుము నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రోజు తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది. ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. తీవ్ర వెన్నునొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిజ్జా బర్గర్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ నొప్పుల నుంచి సులభంగా విముక్తి పొందడానికి ఆహారంలో కేవలం తృణధాన్యాలు తీసుకోవాలి.
2. వెన్నునొప్పులతో బాధపడుతున్న వారు విచ్చలవిడిగా చక్కెర పదార్థాలను తీసుకుంటున్నారు అయితే చక్కెర పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగి నడుము నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కెరతో కలిగిన పదార్థాలను మానుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
3. రెడ్ మీట్ అంటే అందరికీ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారైనా మాంసాలను తినేందుకు ప్రయత్నిస్తారు. అయితే వెన్నునొప్పులతో బాధపడుతున్న వారు రెడ్ మీట్ ను తినడం వల్ల వెన్నునొప్పులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.
4. రిఫైండ్ ఆయిల్ ను ప్రస్తుతం వంటల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ నూనెను అతిగా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వంటి సమస్యల బారిన పడతారు. అయితే వెన్నునొప్పులు ఉన్నవారు కూడా ఈ నూనె వినియోగిస్తే సమస్య ఇంకా తీవ్రతమయ్యే అవకాశాలున్నాయి.
Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook