Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది. అయితే, ఈసారి రుచికరమైన రెడ్ గార్లిక్ పచ్చడి తయారు చేసుకోండి. రుచిగా ఉంటుంది సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా వెల్లుల్లి పచ్చడి ఇష్టపడితే దాని తయారు విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఓ వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకుంటే ఎన్నో రోగాలు నయం అవుతాయి. ఉదయం ఖాళీ కడుపున తీసుకోవాలి. అయితే, వెల్లుల్లితో పచ్చడి చేసుకుంటే కూడా ఆరోగ్యకరం. వెల్లుల్లితో పచ్చడి, కారం పొడి వంటివి మన అమ్మమ్మల కాలంనాటి నుంచి తయారు చేసుకుంటారు. వెల్లుల్లి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం.
కావాల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు- కప్పు
పెద్ద ఉల్లిపాయలు-2
ఎండుమిర్చి-4
కశ్మిరీ రెడ్ చిల్లీ పొడి-2 TBSP
చింతపండు-2 ఇంచులు
ఆవాలు-2TBSp
కరివేపాకు రెండు రెమ్మలు
మినపప్పు-2 TBSP
ఇంగువ-1/2TBSP
పల్లినూనె-4 TBSP
ఉప్పు- రుచికి సరిపడా
ఇదీ చదవండి: నిమ్మకాయ పులిహోర ఒకసారి ఇలా చేసి చూడండి.. అద్భుతమైన రుచి!
గార్లిక్ పచ్చడి తయారీ విధానం..
ఓ ప్యాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కశ్మిరీ రెడ్ చిల్లీ పొడి, చింతపండు వేసుకుని ఉప్పు కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి.
ఇదీ చదవండి: రాగి సూప్.. ఆరోగ్యవంతంగా.. రుచిగా ఇలా తయారుచేసుకోండి..
ఆ తర్వాత మరో ప్యాన్ తీసుకుని ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, మినపప్పు వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో వెల్లుల్లి పచ్చడికి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నూనె విడిచే వరకు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రుచికరమైన సౌత్ ఇండియన్ స్టైల్ రెడ్ గార్లిక్ చట్నీ మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నట్లవుతుంది. దీన్ని వేడివేడి అన్నం, ఇడ్లి, దోశ, ఊతప్పంలోకి తింటే రుచి అద్బుతంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తయారు చేసుకుంటారు. ఈ రెడ్ చట్నీని ఓ గ్లాసు జార్‌లో వేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ పచ్చడి దాదాపు రెండు వారాలపాటు నిల్వ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter