Face And Hair Care From Coffee: భారతీయులంతా పూర్వకాలం నుంచి టీలను, కాఫీలను తీసుకుంటూ వస్తున్నారు. ఉదయం వీటిని తీసుకోవడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉనశమనం లభించి మైండ్ రిఫ్రెష్‌గా మారుతుంది. చాలా మంది ఎక్కువగా కాఫీలు మాత్రమే తాగుతూ ఉంటారు. అయితే కాఫీ వినియోగించే పౌండర్ కాఫీ గింజల నుంచి వస్తుంది. ఇందులో చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కాఫీ తాగడానికే వినియోగించకుండా జుట్టుతో పాటు చర్మానికి కూడా వినియోగించవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని, జుట్టును మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ముఖం, జుట్టు కోసం కాఫీ పౌండర్:
ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్:
కాఫీని సహజమైన ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌లా వినియోగించడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పులో కాఫీ పౌండర్ తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలపాల్సి ఉంటుంది. వీటి రెండింటిని మిశ్రమంలా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ముఖం అందంగా, మొటిమలు లేకుండా తయారవుతుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
డార్క్ సర్కిల్స్:
ప్రస్తుతం చాలా మందిలో డార్క్ సర్కిల్స్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. అంతేకాకుండా ముఖంపై ఇతర చర్మ సమస్యల కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కాటన్ ప్యాడ్‌తో కళ్ళ క్రింద కోల్డ్ కాఫీని అప్లై అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
హెయిర్ ఎక్స్‌ఫోలియంట్ ఏజెంట్ కూడా కాఫీని వినియోగించవచ్చు:
ప్రస్తుతం చాలా మంది రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా సాధరణ షాంపూలో కాఫీని మిక్స్ చేసి తలకు పట్టిస్తే జుట్టు ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. అంతేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి