Harish Rao Fires on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి కేటీఆర్‌పై కేసుకి పొంతనలేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడని.. కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడి వేయడమేనని ఎద్దేవా చేశారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వెనక్కిపోమని స్పష్టం చేశారు.
"ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతోనూ అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము. ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు. కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదు. ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పినప్పుడు.. విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది. గతంలో కూడా కేటీఆర్ గారు విచారణకు సిద్ధమని చెప్పారు. ఈ అంశంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలా అనే అంశంపై మా లీగల్ సెల్ నిర్ణయిస్తుంది.
హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత మా లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం. మొన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు. 9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారు. మొన్న 45 నిమిషాలు ఆపినా కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు. కచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడం కోసమే ఫార్ములా ఈని కేటీఆర్ హైదరాబాద్‌కి తెచ్చారు. ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి.
ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది..? కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు. డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రైతు బంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు.
ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ అభివృద్ధిని మా పార్టీకి ముఖ్యం. రేవంత్ రెడ్డిని కూడా ఫార్ములా ఈ కంపెనీ కలిసిన ఇప్పటిదాకా బయట పెట్టలేదు. రైతు భరోసాను తగ్గించి ప్రజలకు ఇస్తున్నందుకు వారి నుంచి వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఈ కేసు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే. ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమే.
కేటీఆర్ గారి పెట్టిన కేసులు కానీ పార్టీ నేతలపైన పెడుతున్న కేసులను కానీ పార్టీ ఎదుర్కొంటుంది. కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. ఆయన ముఖ్యమంత్రిగా మాకు అధికారులపై.. కోర్టులపైన విశ్వాసం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డిపైన లేదు. కోర్టులో వచ్చిన తీర్పుపైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని.. విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్లం కాదు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులపై చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది" అని హరీష్ రావు అన్నారు.
Also Read: Viral Video: అరె వావ్.. దాబా మీద కూర్చుని పతంగీ ఎగరేస్తున్న వానరం.. నెట్టింట హల్ చల్
Also Read: Bank Notice: బ్యాంకులో తరచూ డబ్బులు వేస్తే.. ఐటీ నోటీసులు వస్తాయా? లిమిట్ ఎంత?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter