Pimples Rid In 2 Days: పాలు అరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఉదయం పూట పాలు తాగడం వల్ల శరీరం దృఢంగా కావడమే కాకుండా శరీరానకి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే ఈ పాలతో శరీర సౌందర్యాన్ని కూడా ప్రకాశవంతంగా చేసుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ముఖాన్ని అందంగా, సౌదర్యవంతంగా చేసుకోవడానికి మార్కెట్ లభించే పాలతో చేసిన ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. ఇవి చర్మాన్ని కాంతి వంతంగా చేసేందుకు కృషి చేస్తున్నాయి. అయితే చాలా మందికి చల్లని పాల వల్ల చర్మానికి కలిగి లాభాలు తెలయవు.! అయితే చల్లని పాలతో ముఖానికి అనేక రకాల లభాలున్నయని వీటిని ఫేస్‌కు అప్లై చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖానికి ఈ పాలను అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ చర్మం పై చల్లటి పాలను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. డ్రై స్కిన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
పాలలో సహజమైన మాయిశ్చరైజర్ గుణాలుంటాయి. కావున దీని వల్ల చర్మంలోని తేమను పెంపొందించి.. మృదువైన చర్మాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది.
2. మొటిమలను తొలగిస్తుంది:
మొటిమల నివారణకు.. పసుపు, తేనెను చల్లటి పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే.. మొటిమల సమస్యలన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మంపై పేరుకుపోయిన నల్లని నూనెను, మురికిని తొలగిస్తుంది. ముఖంపై రంధ్రాలను శుభ్రం చేస్తుంది.
3. ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గిస్తుంది:
క్రమం తప్పకుండా చల్లని పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. అంతేకాకుండా ముఖంపై రంధ్రాలను కూడా తగ్గిస్తుంది. తద్వార యవ్వనమైన కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు.
4. మృతకణాలను శుభ్రపరుస్తుంది:
చల్లటి పాలలో తేనె, పసుపు కలిపి ముఖానికి పట్టించి.. చర్మాన్ని మసాజ్ చేస్తే చర్మంలోని మృతకణాలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి. చర్మం మృదువుగా మారుతుంది.
ముఖంపై పాలను ఎలా అప్లై చేయాలి:
రాత్రిపూట ముఖానికి చల్లని పాలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్ పాలను తీసుకుని అందులో కొంచెం తేనె, పసుపును వేసి ముఖాని అప్లై చేయాలి. ఇలా దీనిని రాత్రంతా ముఖంపై ఉంచి.. ఉదయం మంచి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.