Homemade Cream: మీ వంటింట్లో ఉండే ఈ 2 వస్తువులతో మీ ముఖానికి గోల్డెన్ గ్లో ఖాయం..

Homemade cream For Golden Glow: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దీనికోసం వేళల్లో డబ్బులు ఖర్చు చేసి పార్లర్లకు సైతం వెళ్తాం.అయితే అవి తాత్కాలికంగానే ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ముఖంపై రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 05:06 PM IST
Homemade Cream: మీ వంటింట్లో ఉండే ఈ 2 వస్తువులతో మీ ముఖానికి గోల్డెన్ గ్లో ఖాయం..

Homemade cream For Golden Glow: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దీనికోసం వేళల్లో డబ్బులు ఖర్చు చేసి పార్లర్లకు సైతం వెళ్తాం.అయితే అవి తాత్కాలికంగానే ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ముఖంపై రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మన ముఖంపై సహజసిద్ధంగా గ్లో పెంచుకోవచ్చు.వీటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే ఉండే ఈ రెండు వస్తువులు నీ ముఖ ఛాయలు రెట్టింపు చేస్తాయి.ఓ రెండు వస్తువులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి మన పురాతన కాలం నుంచి వినియోగిస్తూ వస్తున్నారు. ఇవి సౌందర్య ఉత్పత్తులోనే కాగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా అనేక వస్తువుల్లో ఉపయోగిస్తున్నారుఆయుర్వేదంలో కూడా ఈ రెండు వస్తువులు ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నది.

ఈ వస్తువులను కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. దీంతో మీరు ఏ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చిన ఈ రెండు వస్తువులతో చేసిన క్రీమ్ ముఖానికి రుద్దుకోండి. దీంతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మీ వంటింట్లో ఎప్పటికీ ఉండే పసుపు, నెయ్యి. ఇవి ఎప్పుడు మన ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి ఇవి సహజసిద్ధమైనవి. ఈ రెండు వస్తువులను కలిపి క్రీమ్ తయారు చేసుకోవడం వల్ల మన ముఖానికి వెంటనే ఇన్స్టంట్ లో వస్తుంది. మనందరికీ తెలిసిందే పసుపులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ ఛాయను సైతం రెట్టింపు చేస్తుంది.ఇక నెయ్యిలో మాయిశ్చర్ లక్షణాలు ఉంటాయి. 

ఇదీ చదవండి: జుట్టు విపరీతంగా ఊడుతోందా? ఇలా పుదీనా హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఒత్తుగా సిల్కీగా పెరుగుతుంది..

క్రీమ్ తయారు చేసుకునే విధానం..
ఒక ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి, పసుపు వేసి సన్నని మంటపై వేడిచేసుకోవాలి. ఈ రెండూ పేస్ట్‌ మాదిరి అయ్యే క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్,స్టైనర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత  అప్పుడు దాన్ని ఈ బౌల్లోకి వడకట్టుకోవాలి.

ఇదీ చదవండి: టాప్‌ 5 బెస్ట్ ఫేస్‌ స్క్రబ్స్‌.. ఎండకాలం మీ ముఖానికి కాంతివంతంగా చేస్తుంది..

ఈ పసుపు నెయ్యి మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం సాధారణ గది ఉష్ణోగ్రతకు రాగానే మామూలుగా కనిపిస్తుంది. దీన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రతిరోజు వినియోగించడం వల్ల మీ ముఖంపై ప్రభావం వెంటనే కనిపిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  దీని రోజు మనం ముఖంపై వాడొచ్చు.ఇది ఇది మన ముఖానికి పోషకం అందిస్తుంది. వేల సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నాం రోజు రాత్రి పడుకునేటప్పుడు మీ మిశ్రమ ముఖానికి అప్లై చేస్తే మీ ముఖం బంగారు వర్ణంలో మెరిసిపోవడం ఖాయం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

Trending News