Top 5 Best Scrubs: ముఖానికి పునరుజ్జీవనంగా రావాలంటే కనీసం వారానికి ఒక్కసారైనా స్క్రబ్ చేసుకోవాలి. దీనికి మార్కెట్లో దొరికే వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే, అవి ఖరీదైనవి. ఈరోజు ఇంట్లోనే మనం బెస్ట్ హోం స్క్రబ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే వీటితో మీ ముఖానికి నేచురల్ గ్లో వస్తుంది. ఇవి మన వంటింటి కిచెన్లో అందుబాటులో ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
బ్యుటీ ఎక్స్‌పర్ట్స్ షేర్ చేసిన ఈ హోం రెమిడీస్ మీరు కూడా ట్రై చేయండి..
తేనె, ఓట్మిల్..
ఓట్స్ ఓ రెండు స్పూన్స్ తీసుకోండి వీటికి ఒక స్పూన్ తేనె అవసరం. ఆ తర్వాత ప్లెయిన్ యోగార్ట్ కావాల్సి ఉంటుంది. కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసి చేయాలి. వీటిని ఓ బౌల్ లోకి తీసుకుని అన్నింటినీ కలిపి ముఖానికి స్క్రబ్ మాదిరి మృదువుగా రుద్దండి. ఓ పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.
బొప్పాయి, తేనె..
పండిన బొప్పాయి గుజ్జు రెండు స్పూన్లు, ఒక స్పూన్ తేనె అవసరం అవుతుంది.ఈ రెండిటినీ మిక్స్ చేసి స్క్రబ్ మాదిరి ముఖానికి రుద్దాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. బొప్పాయిలో విటమిన్ సీ,ఇ ఉంటాయి. ఇది ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. ఇందలోని ఆల్పా హైడ్రాక్స్ యాసిడ్ చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది.
ఇదీ చదవండి: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..
అరటిపండు, చక్కెర..
పండిన అరటిపండు ఒకటి రెండు స్పూన్ల చక్కెర తీసుకోండి. రెండిటినీ పేస్ట్ మాదిరి తయారు చేసుకోండి. దీన్ని సర్క్యూలర్ మోషన్లో ముఖంపై బాగా రుద్దండి. కొద్ది సమయం తర్వాత ముఖం కడిగితే సరిపోతుంది. అరటిపండు ముఖానికి మాయిశ్చర్ ఇస్తుంది.
తేనె, బ్రౌన్ షుగర్..
రెండు స్పూన్స్ బ్రౌన్ షుగర్, ఒక చెంచా తేనె బాగా కలుపుకోవాలి. ఇది ముఖానికి రుద్ది ఓ మూడు నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
బ్రౌన్ షుగర్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ముఖాన్ని మాయిశ్చర్ కోల్పోనివ్వదు.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి గ్రీన్ టీ.. తయారు చేసుకోండి ఇలా!
కాఫీ స్క్రబ్..
రెండు స్పూన్స్ కాఫీ గింజలు రెండు స్పూన్ల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్
మిక్స్ చేసి ఫేస్ పై స్క్రబ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్‌ఫోలియేట్ గుణం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొత్త కణాల అభివృద్ధికి ప్రేరేపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి