Black Hair Remedies: ఇప్పటికీ చాలామంది ఇళ్లలో నానమ్మ, అమ్మమ్మల జుట్టు నెరవదు గానీ ఇంట్లో మధ్య వయస్సు, యుక్త వయస్సు వారి జుట్టు నెరిసిపోయి కన్పిస్తుంటుంది. దీనికి కారణం అప్పటి, ఇప్పటి ఆహారపు అలవాట్లు, జీవనశైలే.
నెరిసిన జుట్టు నల్లబడేందుకు కెమికల్ డైస్ సహాయం లేకుండా సహజసిద్ధమైన చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. పాతతరంలో ఇలాంటి సహజసిద్ధమైన ఆయుర్వేద చిట్కాలు, వైద్య విదానాలు తరచూ ఉపయోగించడం వల్లనే ఇప్పటికే నాటి తరం వారిలో జుట్టు నెరవకుండా ఉంటోంది.
ఆయుర్వేద వైద్య విధానం అనేది శరీరానికి కావల్సిన సహజసిద్ధమైన సప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా..ఏదైనా లోపముంటే సరిచేసి..రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చాలామంది చెప్పేమాటే అయినా నూటికి నూరుపాళ్లు నిజమిది. ప్రతి చిన్న సమస్యకు వైద్యుడిని సంప్రదించే కంటే ఆ సమస్య తలెత్తకుండా సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే మంచిదని అంటారు.
ఈ ఆర్టికల్ ద్వారా గ్రే లేదా వైట్ హెయిర్ కారణాలేంటి, సహజసిద్ధమైన పద్ధతులు జుట్టు నెరవకుండా ఎలా పనిచేస్తాయి, మెలానిన్, కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తి, జుట్టు నల్లగా ఉండేందుకు ఏం చేయాలనే వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం మీ కోసం.
జుట్టు నల్లబడేందుకు కారణాలు
కేశాలనేవి కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారౌతాయి. కేశాలు పెరిగే కొద్దీ వాటి చుట్టూ ఉండే మెలానోసైట్స్ జుట్టు కుదుళ్లలో మెలానిన్ ఇంజెక్ట్ చేస్తాయి. ఫలితంగా మీ జుట్టు నల్లగా ఉండి, త్వరగా నెరవకుండా ఉంటుంది. మెలానిన్ లేని కెరాటిన్ పసుపు గ్రే రంగులో ఉంటుంది. మెలానోసైట్స్ తగ్గే కొద్దీ జుట్టు సహజరంగును కోల్పోతుంది. మెలానిన్ ఉత్పత్తి తగ్గడానికి చాలా కారణాలున్నాయి.
జెనెటిక్, వయస్సు, శరీరంలో సహజసిద్ధమైన రసాయన మార్పులు, డైట్, ఒత్తిడి, అమ్మోనియో ఉండే రసాయన రంగులు, కాలుష్యం ఇలా వివిధ కారణాలతో మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
గ్రే లేదా వైట్ హెయిర్ సమస్యలు దాదాపు 16 రకాల ఆయుర్వేద సహజసిద్ధమైన పద్ధతులు లేదా చిట్కాలు ఉన్నాయి. బ్లాక్ టీ, సేజ్, కోకోనట్ ఆయిల్ విత్ లెమన్, కరివేపాకు మరియు కొబ్బరినూనె, హెన్నా, కాఫీ, పెరుగు, నిమ్మరసం, బ్రాహ్మి, ఉసరి, పుదీనా పౌడర్, వెనిగర్, ఇండిగో పౌడర్, సీసేమ్ విత్తనాలు, ముద్ద మందారం ఇలా చాలా పద్ధతులున్నాయి.
బ్లాక్ టీ రెమిడీ
ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ సమస్యకు మంచి పరిష్కారమిది. దీనికోసం కేవలం రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు, నీళ్లు కావాలి. ముందుగా టీ ఆకుల్ని నీళ్లలో మరిగించాలి. గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి. ఆకుల్ని తీసివేసి..జుట్టుకు రాయాలి. ఓ గంట తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి నూనె, నిమ్మకాయ చిట్కా
కొబ్బరినూనె, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం అవసరమౌతాయి. ముందుగా కొబ్బరినూనె, నిమ్మరసం రెండింటినీ కలుపుకుని..జుట్టు కుదుళ్లకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఓ గంట తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరినూనె, కరివేపాకు చిట్కా
ఈ విధానానికి కావల్సింది కొబ్బరినూనె, కరివేపాకు ఆకులు. ముందుగా కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి మరిగించాలి. ఆకుల్ని తీసివేసి పూర్తిగా చల్లారిన తరువాత జుట్టుకు అప్లై చేయాలి. నెమ్మదిగా మస్సాజ్ చేయాలి. ఓ గంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఉసిరి హెన్నా ప్యాక్
ఫ్రెష్ హెన్నా పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల ఉసిరి, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, నీళ్లు అవసరమౌతాయి. ముందుగా హెన్నా పేస్ట్ తయారు చేసుకుని..ఉసిరి, కాఫీ పౌడర్ మిక్స్ చేయాలి. పేస్ట్‌గా మారేంతవరకూ కలపాలి. కేశాల కుదుళ్లకు పట్టేలా బాగా రాసి ఓ 2 గంటలు ఉంచాలి. ఆ తరువాత మైల్డ్ షాంపూ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
Also read: High Uric Acid:ఈ నూనెతో ఎంతటి కీళ్ల నొప్పులైనా 2 రోజుల్లో మాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook