Blueberry 7 healthy recipes: బ్లూ బెర్రీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అభిజ్ఞ పనితీరుని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే వీటిని మీ డైట్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంతేకాదు మన శరీరా ఆరోగ్యానికి కూడా బ్లూబెర్రీ పండ్లు ఎంతో ఉపయోగకరమైన ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీంతో మనం తయారు చేసుకోవాల్సిన రెసిపీలు ఏంటో తెలుసుకుందాం.
బ్లూబెరిస్ స్మూథీ..
బ్లూ బెర్రీలతో బ్లూబెర్రీస్ స్మూథీ తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత ఆరోగ్యకరం బ్లూ బెర్రీలను పాలకూర, అరటిపండు తేనె కలిపి బ్లూబెర్రీలను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో లేకపోతే సాయంత్రం వేళ స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
బ్లూబెర్రీ ఓవర్ నైట్ ఓట్స్..
బ్లూబెర్రీ తో ఇప్పటివరకు మనం స్మూతీ నేరుగా తినడమే చూసాం కానీ బ్లూబేరిని ఓట్స్ చేయా సీడ్స్ బాదం వేసి ఒక జార్లో వేసి నైట్ నానబెట్టుకుంటే బ్లూబెర్రీ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అయిపోతాయి. వీటిని ఫ్రిడ్జ్ లో నిలువ చేసుకొని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.
బ్లూ బెర్రీ సలాడ్..
బ్లూ బెర్రీస్ ని వాల్నట్స్ ,పాలకూర ఫటాచీజ్ వేసి కలిపి సలాడ్ మాదిరి తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో ఆరోగ్య కరం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేకపోతే ఈవినింగ్ స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
బ్లూబెర్రీ క్వి నోవా సలాడ్..
ఉడికించిన క్వినోవా ను బ్లూబెర్రీస్ లో టాస్ వేసి ఇందులో కీరదోసకాయ, పుదీనా, నిమ్మరసం వేసి అంతేకాకుండా వినైరెట్ట కూడా వేసి బ్లూ బెర్రీ వినై రెట్ట సలాడ్ తయారు చేసుకోవాలి. ఇది భోజనంలో కూడా తీసుకోవచ్చ.
ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..
బ్లూబెర్రీ చియాసిడ్ జామ్..
ఇది వినడానికి కాస్త వింతగా ఉన్న బ్లూబెర్రీలు చీయా సీడ్స్, ఆపిల్ సిరప్ లెమన్ జ్యూస్ వేసి ఒక మందపాటి టెక్స్చర్ వచ్చేలా ఉడికించుకోవాలి. వీటిని బ్లూ చియాసిడ్ జామ్ మాదిరి తీసుకోవచ్చు స్ప్రెడ్ మాది ఉపయోగించవచ్చు యోగార్ట్‌తో కూడా కలిపి తీసుకోవచ్చు.
బెర్రీస్ చికెన్ సలాడ్..
బ్లూబెర్రీ తో తయారు చేసుకునే మరో రెసిపీ బ్లూబెర్రీ చికెన్ సలాడ్. ఇది చికెన్ బ్రెస్ట్ తో గ్రిల్ చేసి తయారుచేస్తారు.వీటికి కూరగాయలు బ్లూబెర్రీస్ బాదం తేనె మస్టర్ డ్రెస్సింగ్ వేసి చేస్తారు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి లంచ్ కు బెస్ట్ ఐడియా
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
బ్లూ బెర్రీస్ సాల్సా..
టాస్ చేసిన బ్లూబెర్రీలు, టమాటాలు ఎర్ర ఉల్లిపాయలు, సిలాంట్రో జలపినో నిమ్మరసం ఉప్పు వేసి బ్లూబెర్రీ సాల్సా ను తయారు చేసుకుంటారు వీటిని ఏదైనా టాపింగ్స్ మాదిరి ఉపయోగించవచ్చు. చికెన్ లేదా చేపకు టాపింగ్స్ మాదిరి ఉపయోగించి తీసుకోవచ్చు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి