Brazil Nuts Benefits For Thyroid: అతిచిన్నవయసులోనే చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో, బరువు సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. అయితే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా డ్రైఫూట్స్‌ను వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా బ్రెజిల్ నట్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెజిల్ నట్స్ ఎంతో ఆరోగ్య కరమైనవి. ఇవి బాదం, జీడిపప్పు, పిస్తా కంటే ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫూట్ అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బ్రెజిల్ నట్స్ ఎలా ఉపయోగపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
బ్రెలిజ్ నట్స్‌లో ప్రోటిన్స్, ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఇ ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు నిండుగా లభిస్తాయి. వీటిని ఎక్కువగా థైరాయిడ్ వాధిగ్రస్తులకు సూచిస్తారు. ఈ బ్రెజిల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీర నొప్పులు, కొవ్వు, జీర్ణ సమస్యలు, కండరాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు సమస్యలను కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్యలతో బాధపడేవారికి బ్రెజిల్ నట్స్ ఒక అద్భుతమైన ఆహారమని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్రెజిల్ నట్స్ పురుషులు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
బ్రెలిజ్ నట్స్ తింటే థైరాయిడ్ సమస్యలు చెక్:
సాధారణంగా థైరాయిడ్ అనేది చెడు ఆహారం తీసుకోవడం వల్ల లేదా శరీరంలో పోషకలు తగ్గడం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య పురుషుల కంటే అధికంగా స్త్రీలలో కనిపిస్తుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్లాండ్ పనితీరు దెబ్బతినడం వల్ల హార్మోన్ల అసమత్యుల్యత కలుగుతుంది. దీని వల్ల అధిక బరువు, నీరసం, అలసట, చికాకు, ప్రిరియడ్స్ సరిగ్గా రాకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బ్రెజిల్ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ నట్స్‌లోని సెలీనియం థైరాయిడ్ గ్లాండ్ సక్రమంగా పనిచేసేలా సహయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ టీ-౩ ఉత్పత్తికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది. సెలీనియం లోపం వల్ల హైపోథైరాయిడ్, థైరాయిడిటిస్ వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.
బ్రెజిల్ నట్స్‌ను ఉపయోగించే మార్గాలు:
స్నాక్‌గా: బ్రెజిల్ నట్స్‌ను ఇతర గింజలు, ఎండిన పండ్లు లేదా ట్రైల్ మిక్స్‌తో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక సంతృప్తికరమైన స్నాక్‌గా తినవచ్చు.
సలాడ్‌లలో: బ్రెజిల్ నట్స్‌ను సలాడ్‌లకు జోడించడానికి చేర్చవచ్చు. వాటిని ఆకుకూరల సలాడ్‌లు, చికెన్ లేదా చేపల సలాడ్‌లు లేదా పండ్ల సలాడ్‌లలో ఉపయోగించవచ్చు.
బేకింగ్‌లో: బ్రెజిల్ నట్స్‌ను బ్రెడ్, మఫిన్‌లు, కుకీలు, బ్రౌనీల వంటి బేక్డ్ వస్తువులకు క్రంచ్ పదార్థాలతో ఉపయోగించవచ్చు. రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు.
వెజిటేరియన్ లేదా వెగాన్ ప్రోటీన్ మూలంగా: బ్రెజిల్ నట్స్ ప్రోటీన్ కు మంచి మూలం. ఇది వాటిని శాకాహారి లేదా శాకాహారి ఆహారానికి గొప్ప చేర్పుగా చేస్తుంది. వాటిని సూప్‌లు, స్టూలు, చిక్కుళ్ళలో ఉపయోగించవచ్చు లేదా బర్గర్‌లు లేదా మీట్‌బాల్‌ల కోసం మాంసం ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి