Cleaning Leafy Vegetables: ఆకు కూరలు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే వీటిని వండడానికి ముందు పలు రకాల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వానా కాలంలో తేమ వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. వీటిపై తేమ వల్ల క్రిములు, కీటకాలు వ్యాపిస్తాయి. కావున శరీరానికి హాని కలిగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆకు కూరలను శుభ్రం చేసేందుకు చాలా చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుకూరలను ఎందుకు శుభ్రం చేసుకోవాలి..?:
కూరగాయలను శుభ్రం చేసుకుని తీసుకోవడం చాలా మంచిది లేకపోతే చాలా రకాల వ్యాధులకు కారణం కావొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే క్రిములు కలిగిన ఆహారాలను తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ సమస్యలు కూడా రావొచ్చు. వీటిని వండుకునే క్రమంలో శుభ్రం చేసుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
ఆకుకూరలను ఎలా శుభ్రం చేయాలి:
1. చేతులతో శుభ్రం చేయండి:
ఆకుకూరలను చాలా మంది వివిధ రకాలుగా శుభ్రం చేస్తారు. అయితే వీటిని కేవలం చేతులతో మాత్రమే శుభ్రం చేయాలని నిపుణులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆకులపై పేరుకుపోయిన కీటకాలు తొలగిపోతాయి.
2. శుభ్రం చేసే క్రమంలో వేడి నీటిని ఉపయోగించండి:
ఆకుకూరలు కీటకాలు, పురుగుల మందులతో నిండి ఉంటాయి. వీటిని నేరుగా వండుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కావున వీటిని వేడినీటి పాత్రలో వేసి.. ఆకుకూరలను ముంచి తీయండి. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను దూరమవుతాయి.
3. బేకింగ్ సోడా ఉపయోగించడం మార్చిపోకండి:
నోటిలోని సూక్ష్మక్రిములను శుభ్రపరిచేందుకు టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడాను ఉపయోగిస్తారని చాలా మందికి తేలియదు. అయితే ఆకు కూరలను వండుకునే క్రమంలో తప్పకుండా.. కూరగాయలను బేకింగ్ సోడా నీటితో కడగాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook