Control Blood Sugar Level: షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఇవే..

Control Blood Sugar Level: జామ ఆకుల్లో శరీర అనారోగ్య సమస్యలను తగ్గించే చాలా రకాల ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించే చాలా రకాల గుణాలున్నాయి. కాబట్టి వీటితో తయారు చేసిన టీని మధుమేహం ఉన్నవారు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 01:24 PM IST
Control Blood Sugar Level: షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఇవే..

How to Use Guava Leaves to Control Blood Sugar Level: జామ కాయ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ పండ్లే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి జామ ఆకులు చాలా రకాల ఉపయోగపడతాయి. అయితే శరీరంలో  శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తులు తగ్గడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరుగుతాయి. దీని వల్ల తీవ్ర మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అయిలే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జామ ఆకులతో తయారు చేసిన టీని తాగాల్సి ఉంటుంది.

మధుమేహానికి మందు లేదు:
మధుమేహం బారిన ఒక్కసారి పడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించనిలేని వారిలో ప్రాణాంతకంగా కాను మారొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వ్యాధితో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ జబ్బుకు ఎలాంటి మందులు లేకపోయిన ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం తప్పకుండా జామ ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకుల్లో అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయి:
NCBI అధ్యయనం ప్రకారం..జామ ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. దీనిని నిపుణులు యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు కలిగిన ఆకులుగా సూచిస్తారు. కాబట్టి ఈ ఆకులతో చేసిన టీని ప్రతి రోజూ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. జపాన్, చైనా, కొరియా, తైవాన్ వంటి అనేక దేశాల్లో మధుమేహాన్ని నియంత్రించడానికి జామ ఆకులతో చేసిన టీని ఉపయోగిస్తున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ జామ ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.

అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి జామ ఆకుల టీ రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే క్యాన్సర్‌ కాణాలను తగ్గించడానికి ఇందులో ఉండే గుణాలు ప్రభావవంతంగా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకునేవారికి ఈ ఆకుల టీ ఎంతగానో సహాయపడుతుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు చాలా రకాలుగా సహాయపడుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త

Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News