దాన గుణంతో మనస్సుకు ప్రశాంతత

దాన గుణం అలవాటు పడాలంటే 'నో' అనే పదం వాడకండి.. 

Updated: Jul 4, 2018, 08:01 PM IST
దాన గుణంతో మనస్సుకు ప్రశాంతత

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

'నీతోనే నేను ' .. 'నీ వెంటే నేను' అనే సినిమా డైలాగులు వాడటం మన నిత్యజీవితంలో అలావాటైపోయాయి. వాస్తవానికి కష్టకాలం  వచ్చే సరికి ఎవరూ తోడు ఉండరు కదూ. రోబోటిక్ తరహా విద్యా విధానం వల్ల ఎదుటి వాళ్లకు సాయం చేయాలనే ఆలోచన మనకు ఉండటం లేదు.

ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన చివరి క్షణాల్లో ఒక సందేశం ఇచ్చాడు..  ఒట్టి చేతులతో వచ్చాం..ఒట్టి చేతులతో తిరిగి వెళ్తామని..ఎంత సంద కూడబెట్టిన మనం తిరిగి ఇక్కడే వదిలి వెళ్లాలనే సందేశం ఇందులో ఉంది. మనకున్న  దాంట్లో ఇతరులకు కొంచెం సాయం చేస్తే పోయేదేమిటి. 

సాయం చేస్తే మనస్సులో మనకు తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. దానం చేయని వాడు ఎప్పుడు తన సంపద ఎక్కడికి పోతుందనే భయంతో జీవిత కాలం బిక్కు బిక్కుమంటూ ఉంటాడు. అదే స్థితిలో  జీవితం అంతమౌతుంది.

కాబట్టి మిత్రమా మనకు ఉన్నంతలో ఎదుటి వారికి సాయ పడదాం..వాస్తవానికి మనకు 'నో' అనే పదం అలావాటు అయిపోయింది. ఎదుటి వారు కష్టంలో ఉండి మన దగ్గరకు వచ్చి సాయం అడిగితే వెంటనే 'నో' అనేస్తాం.. ఈ  పదాన్ని  మన డిష్నరీ నుంచి తొలిగిస్తే చాలు సాయం చేయం ఈజీ

వాస్తవానికి సాయపడే గుణం అందరికి ఉండకపోవచ్చు. గుణం ఉన్న అలాంటి శక్తి సామర్ధాలు ఉండకపోవచ్చు.. ఎందుకంటే మన కంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. దీని వల్ల మనం ఎదుటి వాళ్లకు సాయం చేయడం కుదరదు.  దీని అర్థాన్ని మరోలా అర్థం చేసుకోవద్దు సుమా..సాయం చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు కనీసం మాట సాయం చేయెచ్చు కదా..

మన దగ్గర రెండు మార్గాలు ఉన్నాయ్..ఒక సాయం చేయడం..రెండు మన స్వార్ధం చూసుకోవడం.. స్వార్ధంతో బతికిన వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు.. ఎదుటి వాళ్లకు మంచి చేసి మహాత్ములుగా మారిన వారు ఎందరో ఉన్నారు..వారి  పేర్లు చిరస్థాయిలో నిలిచిపోయాయి. స్వార్థంతో బతికినోళ్ల చరిత్రహీనులగా మిగిలిపోయారు. చరిత్రే ఇందుకు ఉదాహరణ. 

కాట్టి ఫ్రెండ్స్ అంతా త్యాగం చేసి అందరూ మహాత్ములు కాలేరు. అలా అశించడం కూడా సరైంది కాదు.. కనీసం మనకు ఉన్నంతలో సాయం చేద్దాం..మన చేసిన చిన్న సాయం జీవితాలను నిలబెడతుంది..దీపం వెలిగించడం చిన్న పనే ..అది చుట్టుపక్కల వారికి వెలుగు నింపుతుంది..దీనితో పాటు మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం చేసే చిన్న సాయం ఎదటి వాళ్లకు గొప్ప ప్రయోజనం కలగడంతో పాటు మనకు అది ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

సాయం చేస్తే పోయేదిమీ లేదు..తిరిగి సాయం చేయడం తప్ప. ఎదుటి వారికి మనకు ఉన్నంతలో సాయం చేస్తే మనం కోల్పోయేది ఏమీ ఉందడు..పైగా ఈ సాయం ఏదో ఒక  సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది.

(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54,https://twitter.com/dayashankarmi)