Power Of Deep Breath: ఈ శ్వాస వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తే.. ఎలాంటి రోగాల బారిన పడరు..!

Deep Breath Is Good For Health: శ్వాస మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనిషి జీవించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ప్రస్తుతం శ్వాస తీసుకోవడం వంటి సమస్యలతో త్రీవ ఇబ్బందులు పడుతున్నారు.

Last Updated : Aug 7, 2022, 09:56 AM IST
  • ప్రతి రోజూ శ్వాస వ్యాయామం చేయడం వల్ల
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది
  • ఒత్తిడిని దూరం చేస్తుంది
 Power Of Deep Breath: ఈ శ్వాస వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తే.. ఎలాంటి రోగాల బారిన పడరు..!

Deep Breath Is Good For Health: శ్వాస మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనిషి జీవించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ప్రస్తుతం శ్వాస తీసుకోవడం వంటి సమస్యలతో త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి  గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మేలు జరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజుకు ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే గాఢంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 గాఢంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

1. ఆందోళనలను దూరం చేస్తుంది:

మీ శ్వాస మీకు ఆరోగ్యం.. కావున ప్రతి రోజూ మీరు ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల హృదయ స్పందన రేటును తగ్గించి.. మనస్సును ప్రశాంతంగా చేస్తుంది.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

డయాఫ్రాగ్మాటిక్ శ్వాస ఊపిరితిత్తులను విస్తరింప చేసి.. ఆక్సిజన్ శోషణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యాయామం రోజూ చేయడం వల్ల స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థను మెరుగుపరిచి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3. ఒత్తిడిని దూరం చేస్తుంది:

ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు..చాలా మందిలో శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే టెన్షన్ స్థాయి పెరుగుతున్నట్లు అనిపించినప్పుడు.. పొట్టపై ఒక చేయి వేసి ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి. ఇలా  1 నిమిషం పాటు పునరావృతం చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

4. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు:

శ్వాస వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల శరీరంలో ఎముకలు దృఢంగా మారుతాయి.

5. గాఢమైన నిద్ర:

గాఢమైన శ్వాస వ్యాయామం వల్ల  పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. శరీరాన్ని ప్రశాంత పరిచి గాఢమైన, ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది.

6.  ఎనర్జీ లెవల్స్‌పై ప్రభావం:

శ్వాసక్రియ రక్తంలో ఆక్సిజన్‌ను ప్రభావితం చేసి వాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.  తద్వారా శక్తి స్థాయిలను పెంచుతుంది.

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News