5 Ways To Take Care Of Your Teeth: ఆహారాలు దంతాలలో ఇరుక్కుపోవడం వల్ల నోటీ దుర్వాసన ఇతర సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దంతాలు బలహీనంగా కూడా తయారవుతున్నాయి. అంతేకాకుండా దంతాలు పసుపు రంగులోకి మారడం, పైయోరియా, చిగుళ్ళలో రక్తస్రావం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల దంతాల సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దంత సంరక్షణ కోసం ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది:
ఈ వస్తువులకు దూరంగా ఉండాలి:
ప్రస్తుతం చాలా మంది తియ్యని పదార్థాలను అతిగా తీసుకుంటున్నారు. అయితే ఇవి దంతాలలో అతుక్కుపోయి, విచ్చలవిడిగా బాక్టీరియా పెరిగిపోతోంది. దీని కారణంగా పళ్లలో అనేక రకాల సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఇలా బ్రష్ చేయండి:
దంతాల మురికి తొలగించడానికి పేరుకుపోయిన బాక్టీరియాను నియంత్రించుకోవడానికి తప్పకుండా రోజుకు 2 సార్లు బ్రష్ చేయాల్సి ఉంటుంది. బ్రష్ చేసే క్రమంలో రసాయనాలతో కూడిన టూత్ పౌడర్ వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుట్కా, పొగాకు నమలకండి:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది గుట్కా, పొగాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అయితే వీటి అలవాట్ల కారణంగా దంతాలు, చిగుళ్లు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇప్పటికే దంతాల సమస్యలతో బాధపడుతున్నవారు గుట్కా, పొగాకు మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి