Desert Mandi: దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో ఆహారానికి ఎటువంటి లోటు లేదు. అన్ని ప్రాంతాల ప్రజలకు రుచికరమైన ఆహారం లభిస్తుంది ఇక్కడ. భాగ్యనగరంలో తిండీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని దేశ ప్రజలు చెప్పే మాట. దేశ, విదేశాల వంటకాలు మన హైదరాబాద్‌లో ఉంటాయి. విభిన్నమైన థీమ్‌లతో విభిన్న రుచులతో భోజనప్రియులను సంతృప్తిపరిచే హోటళ్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. కొత్త కొత్త తరహాలో హోటళ్లు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ప్రజలకు మరో కొత్త థీమ్‌తో ఓ హోటల్ వచ్చింది. మన నగరానికి ఎడారినే పట్టుకొచ్చారు. ఇసుక తిన్నెలపై కూర్చొని సరికొత్త అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ హోటల్‌కు వెళ్తే ఎడారి ప్రాంతంలో భోజనం చేసినట్టే ఉంటుంది. కొత్తదనం అభిలషించే వారికి ఈ హోటల్ స్వాగతం పలుకుతోంది. ఈ క్రేజ్ హోటల్ ఎక్కడ ఉంది? ఏమేం పదార్థాలు దొరుకుతాయో చదివేయండి.
Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క
హైదరాబాద్‌లోని నాగోలు ధారు ఎడారి మండీ (ధారూ డిసర్ట్ మండీ) అనే హోటల్‌ను కొత్తగా ఏర్పాటుచేశారు. ఎడారి ప్రాంత ఇతివృత్తంతో ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. అంటే ఎడారి ప్రాంతంలో ఉండే మాదిరి మొత్తం ఇసుక వేశారు. ఇసుకపై భోజనం చేయాల్సి ఉంటుంది. ఇసుకపై సౌదీలో వినియోగించే పెద్దటి తివాచీలు పరిచారు. వాటిపై బల్లలు ఏర్పరచి మండీ పద్ధతిలో భోజనం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎడారి ప్రాంతంలో వేసుకునే టెంట్లు (బెడౌయిన్ టెంట్లు) కూడా ఏర్పాటుచేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభవం పొందేలా ఈ విధంగా తీర్చిదిద్దినట్లు హోటల్ యజమాన్యం చెబుతోంది. చెన్నై నుంచి ప్రత్యేకంగా ఇసుకను తీసుకొచ్చి ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఇసుకలో కూర్చోవడం కాకుండా సాధారణంగా కూర్చునే అందుబాటులో కూడా ఉన్నాయి.
Also Read: Haricut: హెయిర్ కటింగ్ చేసుకోమంటే భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. విస్తుగొలిపిన ఘటన
ఎక్కడ..?
హైదరాబాద్‌లోని నాగోల్. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లే మార్గంలో ఉంటుంది. ఫ్లైఓవర్ కింద పెట్రోల్ బంక్ పక్క గల్లీలో నుంచి వెళ్తే వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook