Resume Preparation Tips: రెజ్యూమ్‌ తయారు చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు: Google మాజీ రిక్రూటర్ సూచన

Google Ex Recruiter Resume Preparation Tips: పెరుగుతున్న పోటీ ప్రపంచం.. ఒక జాబ్ వదిలి మరో జాబ్.. కొత్తగా జాబ్ వెతికేవారు వీళ్లందరికీ మొదటగా క కావాల్సిన అస్త్రం రెజ్యూమ్. ఇది రిక్రూటర్‌కు ఫస్ట్‌ ఇంప్రెషన్. దీంతోనే అభ్యర్థి ఎటువంటి వాడు, ఎన్ని నైపుణ్యాలు కలవారు అని కూడా అంచనా వేస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 26, 2024, 12:06 PM IST
Resume Preparation Tips: రెజ్యూమ్‌ తయారు చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు: Google మాజీ రిక్రూటర్ సూచన

Google Ex Recruiter Resume Preparation Tips: పెరుగుతున్న పోటీ ప్రపంచం.. ఒక జాబ్ వదిలి మరో జాబ్.. కొత్తగా జాబ్ వెతికేవారు వీళ్లందరికీ మొదటగా క కావాల్సిన అస్త్రం రెజ్యూమ్. ఇది రిక్రూటర్‌కు ఫస్ట్‌ ఇంప్రెషన్. దీంతోనే అభ్యర్థి ఎటువంటి వాడు, ఎన్ని నైపుణ్యాలు కలవారు అని కూడా అంచనా వేస్తారు. అందుకే ఫస్ట్‌ ఇంప్రెషన్ అంటే బెస్ట్‌ ఇంప్రెషన్‌ అంటారు కదా. ముఖ్యంగా జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కొత్త ఉద్యోగాలు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ రెజ్యూమ్‌ తయారీలో కొన్ని తప్పులు అస్సలు చేయకూదని అంటున్నారు గూగుల్ మాజీ రిక్రూటర్, ప్రస్తుత ఫెయిర్ క్యాంప్ సీఈఓ నోలన్‌ చర్చ్. ఆయన ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని రెజ్యూమ్‌ ప్రిపరేషన్ టిప్స్ షేర్‌ చేశారు.

జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముఖ్యంగా కొన్ని తప్పులు చేయడం వల్ల రిక్రూటర్ ఇంప్రెషన్ పోతుందని సూచిస్తున్నారు. రెజ్యూమ్‌ తయారీలో ఈ తప్పులు చేయకూడదు. ఎందుకంటే రిక్రూటర్ కు ఒక్కో అభ్యర్థ రెజ్యూమ్‌ పరిశీలించడానికి కేవలం 5 సెకన్లు మాత్రమే సమయం ఉంటుందట. ఈ టైంలోనే కీ పాయింట్స్‌ రెజ్యూమ్‌లో తక్కువ పదాలను ఉపయోగించి తయారు చేయాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి అభ్యర్థులు వారి నైపుణ్యాలతోపాటు డైలీ యాక్టివిటీలను కూడా రెజ్యూమ్‌లో ప్రస్తవిస్తారట. మిటింగ్‌, కోఆర్డినేటింగ్‌ ఇవన్ని చర్చించాల్సిన అవసరం లేదని కొన్ని సమయాల్లో ఇలాంటివి రిజెక్ట్‌ చేసే సందర్భాలు కూడా ఉన్నాయని చర్చ్ తెలిపారు.

ఇదీ చదవండి: రాగి సూప్‌.. ఆరోగ్యవంతంగా.. రుచిగా ఇలా తయారుచేసుకోండి..

అంతేకాదు రెజ్యూమ్‌ తయారు చేసేటప్పుడు కొత్త కంపెనీల్లో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. అంటే కొత్త క్లయింట్లను ఎలా ఆకర్షిస్తారు.  విక్రయాలు ఎలా చేస్తారు. మీరు చేరబోయే కంపెనీ బిజినెస్‌ను ఏ విధంగా వృద్ధి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి అంశాలను రెజ్యూమ్‌లో చెప్పాలి. ఇది రిక్రూటర్‌కు బెస్ట్‌ ఇంప్రెషన్. అది కూడా తక్కువ పదాలను ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:  సికింద్రాబాద్  లోక్ సభ నియోజకవర్గంలో గెలుపెవరిది ?  అక్కడ గెలిస్తే కేంద్రంలో అధికారం గ్యారంటీనా.. ?

ముఖ్యంగా రెజ్యూమ్‌ తయారు చేసేటప్పుడు కీ వర్డ్స్‌ ఉపయోగిస్తారు. అందులో బుల్లెట్లు రాసేటప్పుడు కచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ కీవర్డ్స్‌ ఉండేలా చూసుకోవాలి. మొత్తానికి మీరు రెజ్యూమ్‌లో ఒక వ్యాక్యం రాసారనుకోండి అది చదవడానికి ల్యాగ్‌ అనిపించకూడదు అంటే 25 పదాలు ఉండేలా చూసుకోండి. అంతకంటే తక్కువ ఉండి షార్ట్‌గా చెప్పేస్తే మరీ మంచిది. అతి తక్కువ సమయం ఉన్న రిక్రూటర్ కంటిని త్వరగా ఆకర్షించేలా, మీ నైపుణ్యతపై వారి దృష్టిపడేలా చూసుకోవాలి. ఒక్కోసారి రెజ్యూమ్ పరిశీలించడానికి రిక్రూటర్‌కు కేవలం 3 సెకన్ల సమయం మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News