Barley Water: బార్లీ వాటర్‌ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?

Barley Water Benefits: బార్లీ వాటర్‌ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ వాటర్‌ను బార్లీ గింజలను ఉపయోగించి తయారు చేస్తారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు తగ్గుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 06:19 PM IST
Barley Water:  బార్లీ వాటర్‌ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?

Barley Water Benefits: బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణవ్యవస్థతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం బార్లీ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

బార్లీ వాటర్‌ కేవలం జీర్ణవ్యవస్థ సమస్యలు మాత్రమే కాకుండా అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ నియంత్రలో కూడా ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా బార్లీ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అలాగే డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ వాటర్‌ తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ను అదుపు చేయవచ్చు. 

డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఈ బార్లీ నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు బార్లీ నీరు తాగడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ బార్లీ నీరు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు.  

శరీరంలో వేడిని తగ్గించడంలో బార్లీ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్‌, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్‌, మెగ్నీషియం శరీరాని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా  వేసవిలో కొబ్బరి నీరుతో పాటు ఈ బార్లీ నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. డీహైడ్రేషన్‌ను నిరోధించడానికి సహాయపడుతుంది.

కిడ్నీలో రాళ్లు సమస్యను నివారించడానికి బార్లీ నీరు ఎంతో సహాయపడుతుంది. బార్లీ నీరు డిటాక్స్‌ డ్రింక్‌గా పని చేస్తుంది. బార్లీ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్ల్‌ లక్షణాలు పుష్కలంగా దొరుకుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడంలో బార్లీ నీరు ఎంతో సహాయపడతాయి.

బార్లీ నీరు క్యాన్సర్ అభివృద్ధిని ఆపగలదని వివిధ అధ్యయనాలలో తేలింది. యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని ఆపుతాయి. శరీరంలో కలిగే హానికరమైన వ్యాధులను కూడా ఈ బార్లీ నీరు సహాయపడుతుంది.  మీరు కూడా ప్రతిరోజు బార్లీ నీరు తాగడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 
 

Also Read Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్‌ !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News