Food to Eat in Morning: పొద్దు పొద్దున్నే అరటిపండు - బాదం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Food to Eat in Morning: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 2, 2023, 12:53 PM IST
Food to Eat in Morning: పొద్దు పొద్దున్నే అరటిపండు - బాదం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Eat Banana & Almond in Morning: మారుతున్న జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆరోగ్యకరమైన ఆల్పాహారాలు తీసుకుంటున్నారు. అయితే కొందరు తేలిసి తేలిక అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకుంటున్నారు. ఇంకొందరైతే ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజు ఆల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచిదో? ఏయే సమయాల్లో టిఫిన్‌ తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తాగాలో తెలుసా?:
ప్రస్తుతం చాలా మంది నిద్రలేచిన వెంటనే బెడ్‌ కాఫీ తాగుతున్నారు. ఇలా కాఫీ తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని..నిద్ర లేచిన వెంటనే నీళ్లు మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రంగా మారి..అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఉదయం ఏమి తినాలి?:
ఉదయం పూట ఏది తినాలనే విషయంలో చాలా మందిలో గందరగోళం నెలకొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన 20 నిమిషాలలోపు అరటిపండు, బాదం లేదా ఎండుద్రాక్ష తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..

అరటిపండు ఎవరు తినాలి?:
జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు అరటి పండును తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

బాదం వీరు తప్పకుండా తీసుకోవాలి:

ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నిద్రలేచిన వెంటనే బాదం తినాల్సి ఉంటుంది. ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News