Millet Upma Recipe In Telugu: తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు శరీరానికి శక్తినిచ్చేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని వైద్యులు వీటిని ఆహారాల్లో చేర్చుకోవాలని సలహాలిస్తారు. మిల్లెన్స్‌లో ఫైబర్, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో లభించే ఆయుర్వేద గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అలాగే వీటిల్లో గ్లూటెన్ కూడా లభించదు. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మిల్లెన్స్ కూడిన ఉప్మా రవ్వ కూడా లభిస్తోంది. దీనిని తినడం వల్ల కూడా ఈ లాభాలు పొందవచ్చు. అయితే ఈ రవ్వతో సులభంగా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు మిల్లెన్స్ రవ్వ
2 కప్పుల నీరు
1/2 కప్పు కూరగాయలు (ఉల్లిపాయ, క్యారెట్, మొలకలు, మొదలైనవి)
1 టేబుల్ స్పూన్ నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1 టేబుల్ స్పూన్ కరివేపాకు
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ కారం
1/2 టీస్పూన్ ధనియాల పొడి
1/4 టీస్పూన్ గరం మసాలా
ఉప్పు రుచికి సరిపడా
కొత్తిమీర
తయారీ విధానం:
ఈ ఉప్మాను తయారుయ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
దానిని స్టౌవ్‌పై పెట్టి కొంచెం నూనెను వేసుకుని అందులో రవ్వను వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేయించిన రవ్వను వేరే బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
తర్వాత అందులో కూడా పోపుకు తగినంత నూనెను వేసుకుని బాగా వేడి చేసుకోవల్సి ఉంటుంది.
అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ, క్యారెట్, మొలకలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి, కొద్దిసేపు వేయించాలి.
ఇలా వేయించిన పోపులో రవ్వ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని మరిగించి, అందులో ఉప్పు వేసి కలపాలి.
నీరు మరిగిన తర్వాత, మిల్లెన్స్ రవ్వను వేసి, గరిటతో కలుపుతూ ఉడికించాలి.
రవ్వ ఉడికి నీరు పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే సులభంగా రెడీ అయినట్లే..
చిట్కాలు:
ఈ రెసిపీలో మీకు నచ్చిన కూరగాలను వినియోగించుకోవచ్చు.
అంతేకాకుండా ప్రోటీన్స్ పొందడానికి ఇందులో కోడి గుడ్లను కూడా వినియోగించవచ్చు.
అలాగే ఉప్మా రుచిగా ఉండడానికి నిమ్మ రసాన్ని కూడా వాడవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి