Instant Noodles Side Effects: ప్రసుత్తం మార్కెట్‌లో ఇన్ స్టంట్ నూడల్స్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీని ప్యాకేజింగ్ ఆకర్షించే విధంగా ఉండటం వల్ల జనాలను దీని ఎక్కువగా తింటున్నారు. అంతేకాకుండా ఈ ప్యాకెట్స్‌ను సరిగా గమనిస్తే పోషక విలువలు తక్కువగా ఉంటాయి. దీని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఈ ఇన్ స్టంట్ నూడల్స్ తయారు చేయడానికి మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్ధాని వాడుతుంటారు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా మలబద్దం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా దీనిని ప్రతిరోజు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో అధిక బరువు సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఈ ఇన్ స్టంట్ ఫూడ్స్, ప్యాకేజింగ్ ఫూడ్స్ తినడమే. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే దీన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
Also read: Worlds costliest Honey: ఆ తేనె ఖరీదు రూ.9 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన తేనెలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter