Fatty Liver Symptoms: శరీర అవయవాల్లో గుండె ఎంత ముఖ్యమైందో కాలేయం కూడా అంతే ముఖ్యమైంది. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటికి తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొవ్వులు ఆమ్లాలను శరీరంలో విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది. శరీరానికి ఎంతో అవసరమైన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా కొంతమందిలో కాలేయం దెబ్బతింటుంది. ముఖ్యంగా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆహారాలను తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆహారాలను అతిగా తీసుకోవడం వల్లే ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి:
సంతృప్త కొవ్వులను అతిగా తినడం వల్లే ఫ్యాటీలివ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటివల్ల మధుమేహం సమస్యలు కూడా రావచ్చు వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పిజ్జా, బర్గర్ లేదా స్వీట్ షేక్స్ వంటి ఆహారాలను అతిగా తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు:
శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం అయితే ప్రోటీన్లను అతిగా తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామందిలో ఫ్యాటీ లివర్ ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది.
రెడీ టు ఈట్ ఫుడ్స్:
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా వస్తాయి. ధునిక జీవన శైలి కారణంగా చాలామంది ఇలాంటి ఫుడ్స్ ని అతిగా తింటున్నారు. దీనికి కారణంగా చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్:
చాలామంది ప్రస్తుతం విచ్చలవిడిగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అయితే దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆల్కహాల్ అతిగా తీసుకుంటే ప్రాణాంతకం గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
అతిగా స్వీట్స్ తినడం:
అతిగా స్వీట్స్ తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యలు రావడం కాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అతిగా స్వీట్స్ తీసుకోవడం మానుకోండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి