Six Pack Food Items: వ్యాయామం ఒక్కటే కాదు..ఈ 27 ఫుడ్ ఐటమ్స్‌తోనే సిక్స్ ప్యాక్ సాధ్యం

Six Pack Food Items: సిక్స్ ప్యాక్ కావాలంటే కేవలం వ్యాయమమే కాదు..ఆహారం కూడా ముఖ్యం. మీ దేహానికి దారుఢ్యాన్నిచ్చే 27 రకాల ఆహార పదార్ధాలు తప్పనిసరని అంటున్నారు న్యూటిషియన్లు. అవేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2022, 11:15 PM IST
Six Pack Food Items: వ్యాయామం ఒక్కటే కాదు..ఈ 27 ఫుడ్ ఐటమ్స్‌తోనే సిక్స్ ప్యాక్ సాధ్యం

Six Pack Food Items: సిక్స్ ప్యాక్ కావాలంటే కేవలం వ్యాయమమే కాదు..ఆహారం కూడా ముఖ్యం. మీ దేహానికి దారుఢ్యాన్నిచ్చే 27 రకాల ఆహార పదార్ధాలు తప్పనిసరని అంటున్నారు న్యూటిషియన్లు. అవేంటో చూద్దాం..

జిమ్ సెంటర్లలో చెమట్లు చిందిస్తున్నా కావల్సిన సిక్స్ ప్యాక్ రాదు చాలామందికి. దీనికి కారణం మీరు సరైన డైట్ తీసుకోకపోవడమే. డైట్ సరిగ్గా ఉంటే కచ్చితంగా ఫలితాలుంటాయి.చాలామందికి ఆ డైట్ ఏంటనేది తెలియదు. సరైన ప్యాక్ కావాలంటే తీసుకునే ఆహార పదార్ధాలు బాగుండాలి. ముఖ్యంగా కేలరీలు తగ్గించుకోవాలి. అందుకే తినే ఆహారంలో కేలరీలు, కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు ఏ మాత్రం ఉన్నాయనేది తెలుసుకోవడం ముఖ్యం. మీ బాడీని సిక్స్ ప్యాక్‌గా మార్చాలంటే..కొవ్వు పదార్ధాలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి. 

సాధారణంగా..షుగర్, కార్బోహైడ్రేట్లుండే బ్రెడ్, పాస్తా, ఫ్రైడ్ ఆహార పదార్ధాలు, ఆల్కహాల్ తగ్గించాల్సి ఉంటుంది. వీటికి బదులు కూరగాయలు, తక్కువ ప్రోటీన్లు,  అవకాడో, ఆయిలీ ఫిష్, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, పప్పు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. 

సిక్స్ ప్యాక్ సిద్ధం చేసే ఆహార పదార్ధాలు

1. బ్రోకోలి‌లో కేలరీనే కాకుండా రిచ్ ఫైబర్ ఫుడ్. దీనివల్ల బరువు తగ్గుతారని యూఎస్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
2. సిన్నామోన్ అనేది శరీరంలో ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.
3. చెద్దర్ అనేది లినోలెనిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే పదార్ధం. దీనివల్ల బరువ తగ్గడమే కాకుండా..మజిల్స్ వృద్ధి అవుతాయి. 
4. మష్రూమ్స్ అనేవి తక్కువ కేలరీ ఫుడ్స్‌గా ఉపయోగపడతాయి.  5. స్వీట్ పొటాటోస్ అనేవి లోకేలరీ ఫుడ్స్. బంగాళాదుంపల వల్ల శరీరంలో ఫ్యాట్ చేరదు. 
6. యాపిల్స్‌లో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పోలీఫెనోల్స్ శరీరంలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తాయి.
7. గ్రీన్ టీలో ఉండే కణాలు ధర్మోజెనిక్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీర మెటబోలిజం ప్రక్రియను మెరుగుపరుస్తాయి. 
8. చిల్లీ పెప్పర్ అనేవి శరీరం మెటబోలిజంను గణనీయంగా మెరుగుపరుస్తాయి. 9. బ్లూ బెర్రీస్ కొత్తగా కొవ్వు కణాలు చేరకుండా నియంత్రిస్తాయి. ఇవి కూడా మెటబోలిజంను మెరుగుపరుస్తాయి.
10. గ్రేప్ ఫ్రూట్‌లో ఉండే కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తాయి. దాంతోపాటు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. 11. ఇక పాలలో ఉండే లాక్టిన్ అనే ప్రోటీన్ కార్టిసోన్ తగ్గించేందుకు, రక్తపోటును తగ్గించేందుకు దోహదపడుతుంది. 12. ఓట్స్‌లో ఉండే కార్బోహైడ్రోట్స్ శరీరంలోని సెరిటోనిన్ స్థాయిని పెంచుతాయి. 13. ఆరెంజ్‌లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి రక్తంలో స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది. 14. వాల్ నట్స్‌లో అత్యధికంగా ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, అన్‌శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్..బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తాయి.
15. సాల్మన్ చేపలో అత్యదికంగా ఉండే మెగ్నీషియం కార్టిసోల్ నియంత్రించేందుకు దోహదపడుతుంది. 

ఇవి కాకుండా 24 గ్రాముల చికెన్, 27 గ్రాముల పోర్క్, 20 గ్రాముల పొట్టేలు మాంసం, 19 గ్రాముల బాతు మాంసం, 22 గ్రాముల టర్కీ కోడి మాంసం, 24 గ్రాముల బీఫ్‌లలో ఉండే ప్రోటీన్లు, న్యూట్రియంట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక 25 గ్రాముల ట్యునా ఫిష్, 32 గ్రాముల పర్మేసన్, 30 గ్రాముల పంప్కిన్ సీడ్స్, 13 గ్రాముల గుడ్లు, 28 గ్రాముల పీనట్స్, 36 గ్రాముల సోయాబీన్స్ మనిషి సిక్స్ ప్యాక్‌గా మారేందుకు చాలా దోహదపడతాయి.

Also read: Six pack Tips: నాలుగు వారాల్లో సిక్స్ ప్యాక్ కోసం పది ముఖ్యమైన సూచనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News