How To Make Sabudana Hair Keratin Treatment: జుట్టును దృఢంగా ఒత్తుగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. అయితే ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో జుట్టు పొడిగా, నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయిల్ మసాజ్, కండీషనర్ లేదా హెయిర్ స్పా మొదలైనవాటిని ఆశ్రయిస్తారు. అతంతేకాకుండా మార్కెట్‌లో లభించే పలు ఖరీదైన ప్రోడక్ట్స్ కూడా వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించనప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంట్లోనే సాగో హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ చేయడానికి నిపుణులు సూచించిన ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సాగో మీ జుట్టుకు అంతర్గత పోషణను అందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దెబ్బతిన్న జుట్టును తిరిగి తెప్పించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చుండ్రు సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పని చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది. అయితే సాగో హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాగో హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
సాబుదానా 1 గిన్నె
బియ్యం పొడి 1 టేబుల్ స్పూన్
తేనె 1 టేబుల్ స్పూన్
సబుదానా హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ ఎలా చేయాలో తెలుసా?:
సాగో హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ చేయడానికి, మీరు ముందుగా సబుదానా తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత వాటిని పైన పేర్కొన్న మూడింటిని గిన్నెలో వేసి నీటిలో రాత్రంతా నానబెట్టండి.
వాటిని ఉదయాన్ని కుక్కర్‌లో వేసి బాగా ఉడకబెట్టండి.
ఆ తర్వాత బియ్యాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
వీటిని మిశ్రమంలా తయారు చేసుకుని పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీ సాగో హెయిర్ కెరాటిన్ చికిత్సకు సిద్ధంగా ఉంది.
సబుదానా హెయిర్ కెరాటిన్ చికిత్సను ఎలా ఉపయోగించాలి?
సబుదానా హెయిర్ కెరాటిన్ ట్రీట్‌మెంట్‌ను మీ జుట్టుపై పూర్తిగా అప్లై చేయండి.
అప్పుడు మీ జుట్టు అప్లై చేసి సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి.
దీని తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
వారానికోసారి మీ జుట్టుకు ఈ ట్రీట్మెంట్ చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!
Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook