Hair Care Tips: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో చుట్టుపల్చబడడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం కారణంగా, హార్మోన్లలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక స్త్రీల విషయానికొస్తే చాలామంది జుట్టు అందంగా కనిపించేందుకు స్ట్రెట్లింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు కూడా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇలాంటి నియమాలు పాటించడం వల్లే జుట్టు సమస్యలు రావని నిపుణులు తెలుపుతున్నారు.
జుట్టు అందంగా కనిపించేందుకు పలు రసాయనాలు వాడుతున్నారు:
జుట్టు అందంగా కాంతివంతంగా కనిపించేందుకు చాలామంది రసాయనాలు వెంట్రుకలకు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు ఊడిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ప్రతిరోజు హెయిర్ స్ట్రేట్లింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల బట్టదల వచ్చే అవకాశాలు కూడా అధికమని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికే జుట్టు సమస్యలు ఉన్నవారు ఇలాంటివి చేయకపోవడం చాలా మంచిది.
జుట్టును ఉంగరాల చేస్తున్నారు:
జుట్టు అందంగా రింగులు రింగులుగా కనిపించేందుకు పలు రకాల ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టులో సమస్యలు ఏర్పడి అవి రాలిపోయే అవకాశాలు కూడా అధికమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టును సాదాగా ఉంచుకోవడమే చాలా మంచిది.
హెయిర్ కండిషనర్స్ వినియోగం:
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టును మంచిగా ఆరనివ్వాలి. అంతేకాకుండా మార్కెట్లో లభించే పలు రకాల ఎయిర్ కండిషనర్స్ జుట్టుకు హాని కలిగిస్తున్నాయి. కాబట్టి అందంగా కనిపించేందుకు వీటిని వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రసాయనాలతో కూడిన ఉత్పత్తులు:
జుట్టు పొడిగా, సిల్కీగా మారేందుకు.. వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు వీటివల్ల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతేకాకుండా ఇప్పటికే జుట్టు సమస్యలు ఉన్న వారిలో ఆ సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మార్కెట్లో లభించే ఈ ఇలాంటి ప్రొడక్ట్స్ ను వినియోగించకపోవడం చాలా మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook