Hair Fall Control: బృంగరాజ్, ఉసిరికాయల పేస్ట్‌తో ఎంతటి హెయిర్‌ ఫాలైనా నియంత్రణలో రావడం ఖాయం!

Ayurvedic Remedies For Hair Fall: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బృంగరాజ్, ఉసిరికాయల మిశ్రమాన్ని వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 01:45 PM IST
 Hair Fall Control: బృంగరాజ్, ఉసిరికాయల పేస్ట్‌తో ఎంతటి హెయిర్‌ ఫాలైనా నియంత్రణలో రావడం ఖాయం!

Ayurvedic Remedies For Hair Fall: పొడవాటి, మందపాటి జుట్టును పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. వేసవి కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

బృంగరాజ్, ఉసిరికాయల పేస్ట్‌తో సులభంగా ఉపశమనం పొందొచ్చు:
బృంగరాజ్ జుట్టును దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బృంగరాజ్, ఉసిరికాయల మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన పద్ధతి ప్రకారం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా..ఉసిరి రసంలో రెండు చెంచాల బృంగరాజ్ పొడిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్‌ని జుట్టుపై అప్లై చేసి..అరగంట పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఇలా మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 

కుంకుడు కాయ హెయిర్ ప్యాక్:
జుట్టు ఒత్తుగా,  తెల్లబడకుండా ఉండాలంటే కుంకుడు కాయ హెయిర్ ప్యాక్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా దూరమవుతాయి. 

హెయిర్ ప్యాక్ చేయడానికి.. ముందుగా కుంకుడు కాయలను పొడిలాగా తయారు చేయండి. సుమారు ఒకటిన్నర టీస్పూన్ కుంకుడు కాయ  పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందే పొడిలో ఉసిరి పొడిని తీసుకుని, ఇందులోనే గోరువెచ్చని నీటి నీటిని పోసి బాగా మిక్స్‌ చేసుకుంటే మిశ్రమంలా తయారవుతుంది. పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 25 నిమిషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News