Hair fall: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ 4 రసాలు చాలు.. వీటిని తాగితే జుట్టు సమస్యలకు చెక్‌..

Hair Growth: ఈ రసాలను ప్రతి రోజూ తాగితే శరీరాన్ని చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని నియంత్రించి, అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 04:04 PM IST
Hair fall: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ 4 రసాలు చాలు.. వీటిని తాగితే జుట్టు సమస్యలకు చెక్‌..

Hair Growth: ప్రతి ఒక్కరూ బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇలా వినియోగించడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతన్నారని ఆరోగ్య నిపుణుతు తెలుపుతున్నారు. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన హెల్తీ డ్రింక్స్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అయితే ఈ డ్రింక్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో, వీటిని తాగడం వల్ల జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పరిశోధన ప్రకారం.. స్వీట్ టీ, కాఫీ, కోలా మరియు ఎనర్జీ డ్రింక్స్‌ అధిక పరిమాణంలో తాగడం కారణంగా జుట్టు రాలుతుందని.. వీటిని తాగకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు పేర్కొన్నారు. ఎదైనా రసాయనాలతో కూడిన డ్రింక్‌ మూడు నుంచి నాలుగు లీటర్ల పాటు తీసుకుంటే తప్పకుండా పురుషుల్లో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న పలు రకాల జ్యూస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

జుట్టు బాగా పెరగాలంటే ఈ 4 హెల్తీ డ్రింక్స్ తాగండి:
పాలకూర రసం:

బచ్చలికూరలో ఐరన్, బయోటిన్ అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని ఈ రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల వెంట్రుకల కుదుళ్లతో సహా కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.

దోసకాయ రసం:
దోసకాయ రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలతో పాటు.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ లభిస్తుంది. కాబట్టి  ఈ రసాన్ని ప్రతి రోజూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్కాల్ప్‌లోని చర్మ గ్రంథులపై ప్రభావం చూపుతుంది.

ఉసిరి జ్యూస్:
ఉసిరి రసం ప్రతి రోజూ తాగడం వల్ల జుట్టు పెరుగుదలకు కీలకంగా సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి జుట్టు రక్షించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది జుట్టులోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

క్యారెట్ రసం:
క్యారెట్ రసం కూడా జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్యారెట్‌ రసాన్ని తాగాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

 

Trending News