Hair Growth Tips: హెయిర్ గ్రోత్ కోసం ఇలా చేయండి చాలు.. 12 రోజుల్లో జుట్టు సమస్యలకు కూడా చెక్..

Hair Growth Tips: వాతావరణంలో కలుష్యం పెరగడం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 01:00 PM IST
Hair Growth Tips: హెయిర్ గ్రోత్ కోసం ఇలా చేయండి చాలు.. 12 రోజుల్లో జుట్టు సమస్యలకు కూడా చెక్..

Hair Growth Tips: జుట్టు రాలడం సమస్య సర్వసాధరణంగా మారింది. ప్రస్తుతం వాతావరణంలో కలుష్యం పెరగడం కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది శీతాకాలంలో ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్స్‌, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఐరన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఆకు కూరలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి కెరాటిన్‌ లభించి.. జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

క్యారెట్స్‌:
క్యారెట్‌లో విటమిన్ ఎ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కళ్లకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. అయితే ఇది జుట్టుకు కూడా చాలా రకాలుగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ జుట్టును అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుమ్మడికాయ:
గుమ్మడికాయలో కూడా ఐరన్, బీటా కెరోటిన్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్‌ ఎ.. జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గింస్తుంది. అంతేకాకుండా శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ దీనితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

బొప్పాయి:
కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారికి మన పెద్దలు బొప్పాయిని పండును తినమని సూచిస్తారు. అయితే ఇందులో శరీరాని కావాల్సిన విటమిన్ ఎ, సి, ఇ లు లభిస్తాయి. కాబట్టి ఈ పండును ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి.  అయితే ఇందులో ఉండే గుణాలు జుట్టులోని చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తాయి.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News