Hair Growth Tips: జుట్టు పెరగడం లేదా? ఈ రసంతో మీరు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth Serum: జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉసిరి రసాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఉసిరిలో ఉండే గుణాలు జుట్టు దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 02:27 PM IST
Hair Growth Tips: జుట్టు పెరగడం లేదా? ఈ రసంతో మీరు వద్దన్నా పెరుగుతుంది!

Hair Growth Serum: ఉసిరిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనిని ఆయుర్వేద మూలికగా భావిస్తారు. ఇందులో విటమిన్-ఇ, విటమిన్-సి,  టానిన్ వంటి చాలా రకాల పోషకాలు లభిస్తాయి.  అయితే ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని సంరక్షించడమేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఉసిరిని వినియోగించడం వల్ల సులభంగా దూరమవుతాయి. క్రమం తప్పకుండా జుట్టుకు ఉసిరి నుంచి తీసిన రసాన్ని అప్లై చేయడం వల్ల వెంట్రుకలు బలంగా తయారు కావడమేకాకుండా జుట్టు ఎదుగుదలను కూడా పెంచుతుంది. కాబట్టి జుట్టుకు ఉసిరి రసాన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జుట్టు కోసం ఆమ్లా జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు:
 2 తాజా ఉసిరి
 2 విటమిన్‌ E క్యాప్సిల్స్‌

Also Read: RCB VS PBKS Dream11 Prediction: ఈ రోజు జరిగే పోరులో విజయం సాధించే జట్టు ఇదేనా?, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 ప్రిడిక్షన్‌ వివరాలు!

జుట్టుకు అప్లై చేసే విధానం:
జుట్టు ఆప్లై చేసే ముందు ఉసిరి లోపలి గింజలను పక్కన్న పెట్టాల్సి ఉంటుంది.
అయితే పై గుజ్జు తీసి గ్రైండ్‌ చేయాలి. ఇలా చేసి రసాన్ని గిన్నెలో తీసుకోవాలి.
ఈ రసంలో విటమిన్‌ E క్యాప్సిల్స్‌ నుంచి తీసిన నూనెను వేసి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు జుట్టును బాగా మసాజ్ చేయండి.
సుమారు 30 నుండి 45 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
తేలికపాటి షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: RCB VS PBKS Dream11 Prediction: ఈ రోజు జరిగే పోరులో విజయం సాధించే జట్టు ఇదేనా?, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 ప్రిడిక్షన్‌ వివరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News