Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ఆరోగ్యకర ప్రయోజనాలా?

Dragon Fruit: రోజూ ఓ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో రకాలు పోషకాలు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఏ రకమైన పోషకాలు అందుతాయి, ఏ వ్యాధులు దూరమవుతాయో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2023, 11:33 AM IST
Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ఆరోగ్యకర ప్రయోజనాలా?

Benefits of Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ గురించి మన దేశంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ పండును స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు. ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు, విటమిన్స్ మరియు మినరల్స్ శరీరానికి అందుతాయి. చూడటానికి ఈ పండు గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువగా ఖనిజాలు ఉంటాయి. ఈ ఫ్రూట్ లో పైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు
** ఈ పండులో విటమిన్ సితోపాటు కెరోటినాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంతో అద్భుతంగా పనిచేస్తుంది. 
** డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. అంతేకాకుండా ఇది క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది. 
** డ్రాగన్ ఫ్రూట్ లో అధిక మెుత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
** గర్భిణీలకు డ్రాగన్ ఫ్రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
** డ్రాగన్ పండులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంతోపాటు మెుటిమలను తొలగిస్తుంది. 
** ఇది మీ శరీరంలో ఐరన్ కంటెంట్ ను పెంచడంతో సూపర్ గా పనిచేస్తుంది.
** ఇందులో చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మీ బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
** డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను గట్టి పరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టుకు, కళ్లకు కూడా చాలా మంచిది.

Also Read: Liver Inflammation: కాలేయ వాపును తగ్గించే అద్భుతమైన రసం ఇదే, దీంతో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News