Disadvantages Of Lukewarm Water: ఆరోగ్యానిపుణులు ప్రకారం ఉదయం నిద్రలేచిన తరువాత గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిదని చెబుతుంటారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలోని విషతుల్యతను తొలగించడానికి గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షించుకునేందుకు సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చని నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మం మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సార్లు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నారు గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకుందాం.
సాధారణంగా, గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే అని భావిస్తారు. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు గోరువెచ్చని నీటిని అధికంగా తాగడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కొన్ని రకాల
కొన్ని రకాల కేన్సర్ చికిత్సల సమయంలో నీటిని అధికంగా తాగడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, కేన్సర్ రోగులు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు అధికంగా ద్రవాలు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి హైపోనాట్రేమియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, శరీరంలో నీరు నిలువ ఉండి వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు అధికంగా ద్రవాలు తాగడం వల్ల రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే, గోరువెచ్చని నీటిని ఎంత మాత్రలో తాగాలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పదార్థాన్ని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. గోరువెచ్చని నీటిని కూడా సమతుల్యంగా తాగాలి. అయితే గోరువెచ్చని నీటి తాగడం అనేది వ్యక్తి నుంచి మరో వ్యక్తిని మారుతుంది.
గమనిక: గోరువెచ్చని నీరు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.