Mobile Charging Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ నిత్యవసరంగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు ఏ పని చేయాలన్నా సరే తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సిందే.. తినడానికైనా సరే.. నడిచేటప్పుడు.. కూర్చునేటప్పుడు.. నలుగురితో మాట్లాడేటప్పుడు..ఆఖరికి వాష్ రూమ్ కి వెళ్లాలన్నా సరే మొబైల్ ఉండాల్సిందే. ఇకపోతే మొబైల్ ఎక్కువ సమయం నడవాలి అంటే.. అందుకు తగ్గట్టు చార్జింగ్ కూడా ఉండాలి. అయితే ఒక్కొక్కసారి మనం ఏదైనా సెల్ఫోన్లో ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు.. లేదా మనకు నచ్చిన సినిమా, రీల్ చూస్తున్నప్పుడు చార్జింగ్ అయిపోతుంది. ఇంట్లో చూస్తే పవర్ ఉండదు. ఇంకొంతమంది తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫోన్లో చార్జింగ్ అయిపోతుంది. దీంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.
అందుకే చాలామంది.. కరెంటు లేకుండా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కరెంటు లేకుండా ఛార్జింగ్ పెట్టుకోవచ్చట. మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కరెంటు లేకపోయినా మొబైల్ ఛార్జ్..
కరెంటు లేకపోతే ఛార్జింగ్ ఎలా పెడతారు? అని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ సింపుల్ ట్రిక్.. ముందుగా ఒక బాల్ పాయింట్ పెన్ లేదా తాళంచెవి తీసుకోవాలి.. ఫోన్ చార్జింగ్ చేయడానికి కేబుల్ , కార్ , సిగరెట్ లైటర్ తో ఉండే యూఎస్బీ అడాప్టర్, 9 వోల్టుల బ్యాటరీ, లోహపు క్లిప్ అవసరమవుతాయట.. వీటిని ఉపయోగించి చార్జింగ్ సులభంగా చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
అది ఎలాగంటే..
ప్రతి బ్యాటరీ కి రెండు టెర్మినల్స్ పాజిటివ్ , నెగిటివ్ గుర్తులు ఉంటాయి.. అయితే వీటి నుంచి కరెంటు పుట్టడానికి మనకు ఒక ఇనుప వస్తువును నెగటివ్ సైడ్ చుట్టాలి.. లోహపు క్లిప్పును ఒక భాగం పైకి మరొక భాగం కిందికి ఉండే విధంగా చుట్టుకోవాలి. ఆ తర్వాత పాజిటివ్ కు కార్ అడాప్టర్ ను ఉంచాలి.. తర్వాత అడాప్టర్ మీద లోహపు భాగం తాకేలా చూసుకోవాలి.. దీనివల్ల విద్యుత్ సరఫరా అవుతుంది.. ఫలితంగా మన మొబైల్ ఫోన్ యూఎస్బీ సాకెట్లో ప్లగ్ చేయాలి.
ఇలా చేస్తే చాలు కరెంటు లేకపోయినా సరే ఈజీగా చార్జింగ్ అయిపోతుంది. మరి ఈ టెక్నిక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook