Home Remedies For Pigmentation: వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. కొందరిలోనైతే ముఖంపై తీవ్ర మచ్చలతో పాటు పింపుల్స్ కూడా మొదలవుతున్నాయి. అయితే చాలామంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వారు మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో కూడిన క్రీమ్స్, సౌందర్య లేపనాలను వినియోగిస్తున్నారు. మరికొందరైతే వైద్యులను సంప్రదించి ఖరీదైన చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీనికి బదులుగా ఇంట్లో ఉండే పలు ఆయుర్వేద మూలికలతో సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వారు తెలుపుతున్నారు. ఎలాంటి వస్తువులను వినియోగించి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఎర్ర ఉల్లిపాయ:
ఎర్ర ఉల్లిపాయలో ఉండే గుణాలు క్యాన్సర్ వ్యాధులనుంచి కూడా రక్షిస్తాయి. అయితే దీనితో మొటిమల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ముందుగా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేడినీటిలో వేసుకొని ఆ నీటిని వడపోసుకుని.. కాటన్ గుడ్డతో ముఖంపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన నీటిని 15 నిమిషాల తర్వాత చల్లని శుభ్రమైన నీటితో కడుక్కుంటే మంచి ఫలితాలు పొందుతారు.
తేనె:
తేనె కూడా చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. చర్మంపై ఉన్న అన్ని రకాల వ్యాధుల నుంచి 15 రోజుల్లో సమానం కలిగిస్తాయని చర్మ సౌందర్యం చెబుతున్నారు. కోసం తేనెను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఇందులో నిమ్మరసం ని కూడా వినియోగించవచ్చు.
నిమ్మ రసం, బంగాళాదుంప:
నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు, బంగాళాదుంపలో కొన్ని ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు కీలకంగా సహాయపడుతుంది. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నిమ్మ బంగాళదుంప మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా వారానికి మూడు రోజులపాటు చేస్తే సులభంగా మంచి ప్రయోజనాలు పొందుతారు.
బియ్యం నీరు:
ఒక గిన్నె బియ్యాన్ని సుమారు 30 నిమిషాలు నానబెట్టి, ఆ నీటిని కాటన్ సహాయంతో ముఖంపై రాయండి. సుమారు అరగంట ఉంచి.. మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?
Also Read: Mahesh Babu Rajamouli Film: కామెరూన్ కామెంట్స్ తో మహేష్ -జక్కన్న మూవీపై ఇంటర్నేషనల్ లెవల్లో అంచనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook