Honey Side Effects: ప్రస్తుతం బరువు తగ్గడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవడానికి చాలా మంది తేనెను వినియోగిస్తున్నారు. తేనెను వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా గొంతు సమస్యలకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. అయితే దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలగుతాయని అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్లే కొంత మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు అధిక మోతాదులో తేనెను తీసుకోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తేనెను అతిగా వినియోగించడం వల్ల కలిగే నష్టాలు:
✤ తేనెను అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో చక్కెర, పిండి పదార్థాలు అధిక మోతాదులో లభిస్తాయి. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరగవచ్చట.
✤ తేనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చక్కెరకు బదులుగా ప్రతి ఆహారా పదార్థంలో తేనెను వినియోగించడం వల్ల జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
✤ తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవచ్చు. ముఖ్యంగా మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తేనెను తీసుకోవడం వల్ల తీవ్రతరమయ్యే ఛాన్స్ కూడా ఉంది.
✤ తేనెను ఎక్కువ పరిమాణంలో వినియోగించడం వల్ల దంతాల సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో పంటి నొప్పి, చిగుళ్ల వాపు, కుహరం సమస్యను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నోటి సమస్యలతో బాధపడేవారు దీనిని అతిగా వినియోగించకపోవడం మంచిది.
✤ తేనెలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని వినియోగించడం వల్ల తీవ్ర రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలో అలర్జీ సమస్యలకు దారి తీయోచ్చు.
Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి