Egg Masala Curry: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పోషకాల నిధి. అయితే, గుడ్డులో రకరకాల వంటలు చేసుకుంటారు. మసాలా ఎగ్, మసాలా కర్రీ, కోడిగుడ్డు ఉల్లిగడ్డ, ఆమ్లెట్ వంటివి. అయితే, మనం అక్కడక్కడ రెస్టారెంట్ లేదా ధాబాల్లో వండిన రుచి ఇంట్లో తయారు చేసినప్పుడు రాదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనుకుంటాం. కానీ, తాజా ఆహార పదార్థాలు, మసాలా దినుసులు సరైన సమయానికి వేసుకుంటే రుచి అదిరిపోతుంది. అది ఎలాగో మేం మీకు చెబుతాం. ఈరోజు మనం రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎగ్‌కర్రీకి కావాల్సిన పదార్థాలు..
గుడ్లు-6
నూనె - కావాల్సినంత
ఉల్లిగడ్డలు-2 టమాటాలు-2
అల్లంవెల్లుల్లి పేస్ట్
పచ్చిమిర్చి-3
పసుపు- అరచెంచా
కారం -అరచెంచా
ధనియాల పొడి- అరచెంచా
గరంమసాలా- అరచెంచా
పెరుగు- టేబుల్ స్పూన్
కొత్తిమీర- అరకట్ట
ఇదీ చదవండి: కేవలం 28 గ్రాముల డ్రై ఫ్రూట్స్‌తో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలా తగ్గించుకోవచ్చు
కర్రీ తయారీ చేసే విధానం..
ముందుగా గుడ్లను ఉడికించుకోవాలి. పూర్తిగా ఎక్కువ సమయం కాకుండా సరిగ్గా గుడ్లను ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన వెంటనే చల్లనీటిలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లను దాదాపు 12 నిమిషాలపాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందుకు తాజా గుడ్లు మంచివి.ఆ తర్వాత మరో కడాయి తీసుకుని అందులో నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర వేసి మీడియం మంటమీద వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటాలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మీకు కావాలంటే ఈ సమయంలో మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరగా ధనియాల పొడి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి.
ఇదీ చదవండి: ప్రతిరోజూ పచ్చిఉల్లిపాయ తింటే ఈ 10 రోగాలకు దూరంగా ఉండొచ్చు..
ఇప్పుడు తక్కువ మంటపై ఉడకనివ్వాలి. నూనె మెల్లగా పైకి తెలుతుంది. కాసేపు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు కలపాలి. మిగిలిన మసాలా కూడా వేసుకుని మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మూతపెట్టి ఒక్కనిమిషంపాటు ఉడికించుకోవాలి. చివరగా గుడ్డు వేసి 10 నిమిషాలపాటు తక్కువ మంటపై మరిగించుకోవాలి. పైనుంచి కొత్తిమీరా వేసి గార్నిష్ చేసుకుంటే ఘుమఘమలాడే ఎగ్‌కర్రీ రెడీ.
ఇక్కడ మీరు పెరుగుకు బదులు చింతపండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. గుడ్డు పులుసు అంటారు. ఇది వండే విధానం కూడా ఇలానే ఉంటుంది. కర్రీ మరింత బాగా రావాలంటే క్రీమ్, కొబ్బరి పాలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook