Use Ginger For Gas Relief: గ్యాస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. చాలా మంది ఈ సమస్య నుంచి బయట పడడానికి రకరకాల మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల సమస్య తగినప్పటికి మందుల కారణంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చిట్కాలను వాడడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
గ్యాస్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..
⁎ ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలిని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
⁎ పీచుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
⁎ మసాలాలు, ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి.
Also read: Carrots For Diabetics: మధుమేహం ఉన్నవారు క్యారెట్లను తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది..
గ్యాస్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు...
⁎ రోజూ ఉదయం పరగడుపున శొంఠి పొడిని, పాత బెల్లాన్ని తీసుకుని లడ్డులా తయారు చేసుకోవాలి. ఈ లడ్డును తిని వెంటనే ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.
⁎ ఒక గిన్నెలో.. గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అర టీ స్పూన్ శొంఠి పొడిని, ఒక టీ స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
⁎ ఒక గిన్నెలో.. ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ బెల్లాన్ని వేసి కలపాలి. ఈ నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
⁎ గ్యాస్ సమస్యను తగ్గించే మందులను వాడడానికి బదులుగా ఇంటి చిట్కాలను పాటిస్తూ చక్కటి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Dark Circles: ఏం చేసినా కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా? ప్రతిరోజు ఇలా చేయండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి