How To Make Banana Bread Recipe: అరటి పండ్లు మన శరీరానికి ఎంతో మంచిది అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజు తినమని సలహా ఇస్తారు. అరటి పండ్లలో అధిక పరిమాణంలో పోషక గుణాలు లభిస్తాయి కాబట్టి ఇవి శరీరానికి తక్షణమైన శక్తిని అందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు ప్రతిరోజు వీటిని అల్పాహారం తర్వాత ఇవ్వడం వల్ల శరీర అభివృద్ధి మెరుగుపడుతుంది అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది అరటి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకుంటారు.
అరటి పండ్లతో తయారు చేసుకున్న ఆహార పదార్థాల్లో పోషక గుణాలు తగ్గినప్పటికీ శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా వీటిని తినని పిల్లలకు బ్రెడ్స్, ఇతర ఆహార పదార్థాల లాగా తయారుచేసి కూడా తినిపించవచ్చు. అయితే చాలామందికి అరటి పండ్లతో బ్రెడ్ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలని సందేహం రావచ్చు. అలాంటి వారికోసం మేము ఈరోజు బనానా బ్రెడ్ రెసిపీని అందించబోతున్నాం.
కావలసిన పదార్థాలు:
బాగా మగ్గిన అరటిపండ్లు - 2 (సుమారు 1 ½ కప్పు ముద్ద)
వెన్న - ½ కప్పు (గది ఉష్ణోగ్రత)
గుడ్డు - 1
బెల్లం పొడి - ½ కప్పు
మైదా - 1 ½ కప్పు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - ¼ టీస్పూన్
వాల్ నట్స్ (ముక్కలు చేసినవి) - ½ కప్పు
ఖర్జూరాలు (ముక్కలు చేసినవి) - ½ కప్పు
Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వెన్న, గుడ్డు, బెల్లం పొడి కలిపి బాగా కలపండి.
అరటి ముద్ద, సగానికి సగం మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిగిలిన మైదా, వాల్ నట్స్, ఖర్జూరాలు, టూట్టి ఫ్రూటి (ఇష్టమైతే) కలిపి కూడా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
ముందుగా వేడి చేసిన ఓవెన్ లో (180°C) గ్రీజ్ చేసిన బేకింగ్ ట్రేలో బ్యాటర్ ను పోయాల్సి ఉంటుంది.
40 నుంచి 50 నిమిషాల వరకు బాగా బ్రేక్ చేసుకుని ఓవెన్ నుంచి పక్కకు తీసేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఓ బౌల్లోకి తీసుకొని మీకు ఇష్టమైతే దాని పైనుంచి షుగర్ సిరప్ ని కూడా వేసుకోవాలి. అంతే సులభంగా బనానా బ్రెడ్ రెసిపీ తయారైనట్లే..
Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter