Aloo Jeera Recipe: జీలకర్ర, బంగాళదుంప రెండు కలిపి వండుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. బంగాళదుంపతో వివిధ కూరలు వండుకోవచ్చు. దీంతో రుచి కూడా బాగుంటుంది. అయితే, బంగాళదుంప, జిలకర్ర వేసుకుని తయారు చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ రిసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
బంగాళదుంప- 4
నూనె లేదా నెయ్యి-2
జిలకర్ర- 1tbsp
పసుపు-1 tbsp
ధనియాల పొడి- 1tbsp
ఉప్పు- రుచికిసరిపడా
ఆలూజీరా తయారీ విధానం..
బంగాళదుంపను తొక్క తీసి క్యూబ్స్ మాదిరి కట్ చేసుకోవాలి. వీటిని చల్లనీటిలో వేసి బాగా కడగాలి. ఆతర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జిలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు కట్ చేసిన ఆలుగడ్డ కూడా వేసి బాగా కలపాలి.
ఇదీ చదవండి:ఉప్మారవ్వతో చిల్లా.. ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవాల్సిందే..
ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మసాలాలు బంగాళదుంపలకు బాగా పట్టాల్సి ఉంటుంది. దీన్ని తక్కువ మంటపై వేడి చేసుకోవాలి. బంగాళదుంప మెత్తగా ఉడికించుకోండి. మసాలాలు కూడా వేసుకోండి. ఈ రిసిపీ కేవలం ఓ 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
చివరగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. దీని రుచి పుల్లపుల్లగా రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని గార్నీష్ చేయాలి. రుచికరమైన ఆలూ జీరా రెడీ చపాతీ లేదా రైస్‌లో ఈ కూర బాగుంటుంది.
ఇదీ చదవండి:ప్రతిరోజూ ఒక ఖర్జూరం తింటే జరిగే మిరాకిల్స్ మీరు ఊహించలేరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి