Garlic Soup Recipe: సాధారణంగా మనం స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకుంటాం. టమాటా సూప్ స్వీట్ కార్న్, మిక్స్ వెజ్, క్యాబేజీ వంటి సూప్‌లు తయారు చేసుకుంటారు. వెల్లుల్లి అంటే ఇష్టపడని వారుంటారు.ఈ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సూప్ ఉల్లిపాయ, బంగాళదుంప, ఫ్రెష్ క్రీమ్, జిలకర్ర, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు వేసి తయారు చేసుకుంటారు. వేడివేడిగా చల్లని వాతావరణంలో ఈ సూప్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు ఇందులో మీకు ఇష్టమైన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అల్లం, పాలకూర కూడా వేసి సూప్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు వేడివేడి వెల్లుల్లి సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
వెల్లుల్లి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు-8
బంగాళదుంప-1
జిలకర్ర-1/2 tbsp
వర్జిన్ ఆలీవ్ ఆయిల్-2 tbsp
ఉల్లిపాయ-1
ఫ్రెష్ క్రీమ్-1/2 tbsp
ఆరిగానో- 1 tbsp
ఉప్పు- రుచికి సరిపడా
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
వెల్లుల్లి సూప్ తయారు చేసుకునే విధానం..
స్టవ్ ఆన్ చేసి ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో ఆలీవ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత జిలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే కట్ చేసిన వెల్లుల్లి కూడా వేసి మరో నిమిషం పాటు వండుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన బంగాళదుంపలు కూడా వేసి ఓ రెండు కప్పుల నీరు పోయాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకుని మూత పెట్టి కవర్ చేయాలి. ఈ మిక్చర్ అంతా ఓ 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఫ్రెష్ క్రీమ్‌కూడా వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
ఒక బ్లెండర్ లో ఇందులో వేసిన పదార్థాలను వడకట్టుకుని పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని మళ్లీ మిగిలిన సూప్ నీటిలో వేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఈ సూప్‌ను ఓ బౌల్ లోకి తీసుకోవాలి. అందులోనే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి వడ్డించుకోవాలి. మీ వద్ద ఆరిగానో లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter